Share News

90s Web Series: ‘ఇలాంటి ఫ్రెండ్ అందరి లైఫ్‌లో ఒకడుంటాడు’.. సాయిరాంతో స్పెషల్ చిట్ చాట్

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:47 AM

#90's మిడిల్‌ క్లాస్‌ బయోపిక్.. ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రతి ఒక్కరూ బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇందులో ఉన్న 90ల్లోని వాతావరణం, ఫ్యామిలీ గొడవలు, స్కూల్‌ లైఫ్‌, ఫస్ట్‌ లవ్‌, ఫ్రెండ్‌షిప్‌ ఇలా ప్రతి ఇన్సిడెంట్‌ అందరికీ కనెక్ట్ అయింది.

90s Web Series: ‘ఇలాంటి ఫ్రెండ్ అందరి లైఫ్‌లో ఒకడుంటాడు’.. సాయిరాంతో స్పెషల్ చిట్ చాట్

#90's మిడిల్‌ క్లాస్‌ బయోపిక్.. ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రతి ఒక్కరూ బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇందులో ఉన్న 90ల్లోని వాతావరణం, ఫ్యామిలీ గొడవలు, స్కూల్‌ లైఫ్‌, ఫస్ట్‌ లవ్‌, ఫ్రెండ్‌షిప్‌ ఇలా ప్రతి ఇన్సిడెంట్‌ అందరికీ కనెక్ట్ అయింది. ముఖ్యంగా 90ల్లోని పిల్లలకైతే గడిచిపోయిన బాల్యాన్ని కళ్లముందు ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో ఓ క్యారెక్టర్‌కి మాత్రం అందరూ బాగా కనెక్ట్‌ అయ్యారు. తనే కార్తీక్‌.. రఘు ఫ్రెండ్‌గా సిరీస్‌లో అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. మన లైఫ్‌లోనూ ఇలాంటి ఫ్రెండ్‌ ఒకడు ఉన్నాడు. అని అందరికీ గుర్తు చేశాడు. స్క్రాచ్‌ సాయిరామ్‌గా ఇన్‌స్టాలో అందరికీ సుపరిచితమైన సాయిరామ్‌.. 90's సిరీస్‌తో మరింత దగ్గరయ్యాడు.

వరంగల్‌కు చెందిన సాయిరామ్‌ 11 ఏళ్ల వయసులోనే కిరాక్‌ కిడ్స్‌ ప్రొగ్రామ్‌తో టెలివిజన్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పటాస్, జబర్దస్త్‌, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రామ్స్‌ చేసి పాపులారిటీ సంపాదించాడు. జబర్దస్త్‌ రైటర్‌ సందీప్‌ ద్వారా 90's డైరెక్టర్‌ ఆదిత్యతో తనకు పరిచయం ఏర్పడిందని.. అతని ముందు చేసిన కొన్ని కామెడీ స్కిట్స్‌తో.. 90'sలో అవకాశం వచ్చిందని సాయిరామ్‌ తెలిపాడు.


తాను కూడా ఒక మిడిల్‌ క్లాస్‌ కుర్రాడినే అని.. సిరీస్‌లో కార్తీక్‌, బయట సాయిరామ్‌ ఇద్దరూ ఒకటేనన్నాడు. వివక్ష డైలాగ్‌ చూసి చాలా మంది మెచ్చుకున్నారని.. ఇప్పుడు ఎక్కడికెళ్లినా గుర్తు పడుతున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం తన ఊరితోపాటు కాలేజీలోనూ సెలబ్రిటీగా మారిపోయాడు. ప్రస్తుతం తన కాన్సన్‌ట్రేషన్‌ అంతా వెండితెరపైనే ఉందన్నాడు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 11:58 AM