Share News

Marry Lord Krishna: శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యువతి.. కానీ బంధువులు మాత్రం

ABN , Publish Date - Apr 20 , 2024 | 11:03 AM

ఓ యువతికి శ్రీకృష్ణుడు(Lord Krishna) అంటే విపరీతమైన పిచ్చి. చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడిని పెళ్లి(marriage) చేసుకోవాలనేది ఆమె కల. అయితే ఆ యువతి ఆ కలను నెరవేర్చుకోవడానికి ఏకంగా తన కుటుంబాన్ని ఒప్పించింది. చివరకు తన పెళ్లి కలను నెరవేర్చుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని గ్వాలియర్‌(Gwalior)లో శ్రీరామనవమి రోజు చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Marry Lord Krishna: శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యువతి.. కానీ బంధువులు మాత్రం
24 years woman Shivani Parihar married Lord Krishna

ఓ యువతికి శ్రీకృష్ణుడు(Lord Krishna) అంటే విపరీతమైన పిచ్చి. చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడిని పెళ్లి(marriage) చేసుకోవాలనేది ఆమె కల. అయితే ఆ యువతి ఆ కలను నెరవేర్చుకోవడానికి ఏకంగా తన కుటుంబాన్ని ఒప్పించింది. చివరకు తన పెళ్లి కలను నెరవేర్చుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని గ్వాలియర్‌(Gwalior)లో శ్రీరామనవమి రోజు చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


గ్వాలియర్‌లో నివసిస్తున్న 23 ఏళ్ల శివాని పరిహార్(Shivani Parihar) శ్రీకృష్ణుడిని(Lord Krishna) పెళ్లి చేసుకుంది. దీంతో తన జీవితాన్ని శ్రీకృష్ణుడికి అంకితం చేసింది. సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకుని, ఊరేగింపు కూడా నిర్వహించారు. అంతేకాదు ఈ వేడుకను మూడు రోజుల పాటు నిర్వహించారు. శివాని పెళ్లి కార్యక్రమాలు ఏప్రిల్ 15 నుంచి తన ఇంట్లో ప్రారంభమైనట్లు శివాని తల్లి మీరా పరిహార్ తెలిపారు. మొదటి రోజు పసుపు, నూనె, రెండో రోజు మంటపం, ఏప్రిల్ 17వ తేదీన కళ్యాణోత్సవం జరగిందని వెల్లడించారు.


కన్హాజీని వివాహం చేసుకోవడానికి శివాని(Shivani) ఒంటరిగా రాలేదు. బృందావన్ నుంచి సాధువులు, ఋషుల సమక్షంలో ఊరేగింపుతో గ్వాలియర్ చేరుకుని వివాహం చేసుకున్నారు. కైజర్ హిల్ వద్ద ఉన్న ఆలయం వద్ద వివాహ ఊరేగింపునకు శివాని కుటుంబం, సన్నిహితులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత పెళ్లి ఆచారాలు పూర్తయ్యాక శివాని కన్హాజీతో ఏడు ప్రదక్షిణలు చేసింది. ఈ సందర్భంగా తరలివచ్చిన వందలాది మంది మహిళలు మంగళ హారతులు పట్టారు. దీంతో పాటు పాటలు పాడి, నృత్యాలు కూడా చేశారు. ఈ వేడుకను చూసేందుకు స్థానిక ప్రజలే(people) కాకుండా సాధువులు, ఋషులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


గ్వాలియర్‌(Gwalior)లోని న్యూ బ్రిజ్ విహార్ కాలనీలో నివసించే శివాని ఇప్పుడు కాషాయ దుస్తులలో కనిపిస్తోంది. ఆమె బీకామ్ చేసింది. ఆమె తండ్రి రామ్ ప్రతాప్ పరిహార్, తల్లి మీరా పరిహార్ ఈ వివాహాన్ని మొదట వ్యతిరేకించారు. కానీ కుమార్తె మొండితనం కారణంగా, వారు కూడా దీనికి అంగీకరించవలసి వచ్చింది. అయితే ఈ పెళ్లితో తన బంధువులు సంతోషంగా లేరని, తాను ఎవరినీ పట్టించుకోనని శివాని అంటోంది. ఇప్పుడు జీవితాంతం ఆయన భక్తి, పూజలతోనే గడుపుతానని శివాని వెల్లడించింది.


ఇది కూడా చదవండి:

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఆ తప్పు కారణంగా..

Lok Sabha Elections 2024: మొదటి దశలో 63 శాతం దాటిన ఓటింగ్.. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం

Updated Date - Apr 20 , 2024 | 11:10 AM