Share News

Lok Sabha Elections 2024: మొదటి దశలో 63 శాతం దాటిన ఓటింగ్.. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ

ABN , Publish Date - Apr 20 , 2024 | 06:49 AM

దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుక అయిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఉత్కంఠ ఎంతగా ఉందంటే ప్రజలు ఎండ వేడిని కూడా పట్టించుకోకుండా వచ్చి పెద్ద ఎత్తున ఓటు వేశారు. సీట్ల పరంగా ఇదే అతిపెద్ద దశ.

Lok Sabha Elections 2024: మొదటి దశలో 63 శాతం దాటిన ఓటింగ్.. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ
Lok Sabha Elections 2024

దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుక అయిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఉత్కంఠ ఎంతగా ఉందంటే ప్రజలు ఎండ వేడిని కూడా పట్టించుకోకుండా వచ్చి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. సీట్ల పరంగా ఇదే అతిపెద్ద దశ. ఈ క్రమంలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 63.5% (రాత్రి 11 గంటల నాటికి) ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక సంఘటనల మధ్య 77.57 శాతం ఓటింగ్ జరగగా, చాలా చోట్ల ప్రశాంతంగా ముగిసింది. నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంతం, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.


ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం త్రిపుర(tripura)లో అత్యధికంగా 81.5%, సిక్కింలో 80% నమోదు కాగా, మణిపూర్, పుదుచ్చేరిలో (78.3%), మేఘాలయలో (74.5%), అసోంలో (73.4%) ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మొదటి దశ లోక్‌సభ ఎన్నికలలో నక్సల్స్ ప్రభావిత బస్తర్ లోక్‌సభ స్థానంలో 63.41 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్‌లో అత్యల్పంగా 47.49 శాతం ఓటింగ్ నమైదైంది. ఈ దశ తర్వాత రెండో దశ ఓటింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. మొత్తం ఏడు దశల్లో 543 స్థానాలకు జూన్ 1న పోలింగ్ ముగియనుంది. జూన్ 4న అన్ని సీట్ల ఫలితాలు రానున్నాయి.


తమిళనాడు(Tamil Nadu)లోని అన్ని (39) నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అక్కడ కూడా 62 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉదయం ప్రతికూల వాతావరణం కారణంగా అరుణాచల్‌లో పోలింగ్ తక్కువగా నమోదైంది, అయితే తరువాత అది 65 శాతానికి పైగా పెరిగింది. ఈ సందర్భంగా తొలి రౌండ్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డు స్థాయిలో ఎన్డీయేకు ఓటు వేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇది కూడా చూడండి:

PM Modi: సభ మధ్యలో తల్లి ఫోటో చూసి మోదీ భావోద్వేగం

Pinarayi Vs Rahul: జైళ్ల పేరుతో మమ్మల్ని భయపెట్టొద్దు... రాహుల్‌‌కు కేరళ సీఎం పంచ్


మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 20 , 2024 | 06:56 AM