Share News

AP Politics : చంద్రబాబుకు టచ్‌లో వైసీపీ ఎంపీ.. కుమారుడికి టికెట్ కన్ఫామ్..!?

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:27 PM

ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఏ క్షణాన అయితే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నియోజకవర్గాల ఇంచార్జులను మార్చడం మొదలుపెట్టారో అప్పట్నుంచే.. అధికార పార్టీ పతనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటి వరకూ రెండు జాబితాలను రిలీజ్ చేయడంతో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, ఐదారుగురు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని.. తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూ కడుతున్నారని వార్తలు వింటూనే ఉన్నాం..

AP Politics : చంద్రబాబుకు టచ్‌లో వైసీపీ ఎంపీ.. కుమారుడికి టికెట్ కన్ఫామ్..!?

ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఏ క్షణాన అయితే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నియోజకవర్గాల ఇంచార్జులను మార్చడం మొదలుపెట్టారో అప్పట్నుంచే.. అధికార పార్టీ పతనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటి వరకూ రెండు జాబితాలను రిలీజ్ చేయడంతో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, ఐదారుగురు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని.. తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూ కడుతున్నారని వార్తలు వింటూనే ఉన్నాం. మరోవైపు.. మూడో కంటికి తెలియకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ, జనసేన అధినేతలతో టచ్‌లోకి వెళ్లారని టాక్ నడుస్తోంది. దీంతో వైసీపీ హైకమాండ్ ఆలోచనలో పడిందట. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తాజాగా వైసీపీ కీలక నేత, ఎంపీ ఒకరు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది.


Magunta-Srinivasa-Reddy.jpg

ఇదీ అసలు కథ..!

మాగుంట ఫ్యామిలీ గురించి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాజకీయ, వ్యాపార రంగాల్లో ఆరితేరిన ఈ కుటుంబానికి వైసీపీలో అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయన్నది అభిమానులు చెబుతున్న మాట. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసరెడ్డి (Magunta Sreenivasa Reddy) ఒంగోలు ఎంపీగా వ్యవహరిస్తున్నారు. తన తర్వాత కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ (Ongole MP Ticket) టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని అడగ్గా.. ఇచ్చే ప్రసక్తే లేదని పరోక్షంగా సంకేతాలు వచ్చాయట. దీంతో తీవ్ర అసంతృప్తి, అసహనానికి లోనైన మాగుంట.. తన కుమారుడికి టికెట్ ఇచ్చే పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే చంద్రబాబుతో మాగుంట టచ్‌లోకి వెళ్లారట. ఒంగోలు లేదా నెల్లూరు ఎంపీ టికెట్ తన కుమారుడికి ఇస్తే తాను మళ్లీ సైకిలెక్కడానికి రెడీగా ఉన్నట్లు చంద్రబాబుతో ఎంపీ మాగుంట చెప్పినట్లు సమాచారం. అయితే.. బాబు నుంచి కూడా స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలియవచ్చింది. ఇప్పటికే రెండుసార్లు బాబుతో మాగుంట టచ్‌లోకి వెళ్లారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే.. మాగుంట తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.

Magunta-1.jpg

ఇదే జరిగితే..?

మాగుంట వైసీపీకి గుడ్ బై చెప్పి.. సైకిలెక్కితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రాజకీయం చాలా మారిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కాగా.. ఒంగోలు ఎంపీ టికెట్‌ ఇవ్వాలంటే చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ను తిట్టాలంటూ మాగుంటకు జగన్‌ విధించిన షరతులు విధించారట. వాటిని తిరస్కరించడంతో మాగుంటపై జగన్‌కు కోపం వచ్చిందట. అందుకే టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారని సమాచారం. దీంతో నొచ్చుకున్న మాగుంట ఇంత అవమానం జరిగిన వైసీపీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలో తన వెంట వచ్చే ఎమ్మెల్యేలు, కీలక నేతలను సైతం టీడీపీలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు కూడా మాగుంటతో టచ్‌లో ఉన్నారట. దీంతో వైసీపీ అధిష్టానంలో టెన్షన్ మొదలైందట. తాజాగా అందుతున్న సమాచారం మేరకు దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ను ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ వైసీపీ నుంచి గానీ.. మాగుంట నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో.. పోతే పోనీలో అని హైకమాండ్.. కచ్చితంగా సైకిలెక్కాల్సిందేనని ఎంపీ అనుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు ఇంకా ఇలాంటి పరిణామాలు ఇంకెన్ని జరుగుతాయో చూడాలి మరి.

Magunta.jpg

Updated Date - Jan 07 , 2024 | 11:27 PM