Share News

YSRCP: బాలినేనితో గంటసేపు వైసీపీ పెద్దల మంతనాలు.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:47 PM

Balineni Issue : మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంతో వైసీపీకి పెద్ద చిక్కే వచ్చిపడినట్లయ్యింది.! వైసీపీలో ఉండాలంటే బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలి.. ఒకవేళ పార్టీ మారితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి అల్లకల్లోల్లమే..! దీంతో బాలినేని అలకబూనిన ప్రతిసారీ బుజ్జగించడం, మంతనాలు జరపడం లాంటివి అధిష్టానం చేస్తోంది. అయినా సరే తగ్గేదేలే అని.. కచ్చితంగా తాను చెప్పిన వారికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు...

YSRCP: బాలినేనితో గంటసేపు వైసీపీ పెద్దల మంతనాలు.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంతో వైసీపీకి పెద్ద చిక్కే వచ్చిపడినట్లయ్యింది.! వైసీపీలో ఉండాలంటే బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలి.. ఒకవేళ పార్టీ మారితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి అల్లకల్లోల్లమే..! దీంతో బాలినేని అలకబూనిన ప్రతిసారీ బుజ్జగించడం, మంతనాలు జరపడం లాంటివి అధిష్టానం చేస్తోంది. అయినా సరే తగ్గేదేలే అని.. కచ్చితంగా తాను చెప్పిన వారికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. సోమవారం నాడు సీఎంవోకు వచ్చిన బాలినేని నిమిషాల వ్యవధిలోనే.. అది కూడా కనీసం కారు కూడా దిగకుండానే వెనుదిరగడం, పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలతో అప్రమత్తమైన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. వెంటనే వైసీపీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను రంగంలోకి దింపి మంతనాలు షురూ చేశారు.


JAGAN-BALINENI.jpg

ఇవాళ సీన్ ఇదీ..

బాలినేనితో సజ్జల, విజయసాయిలు భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగానే ఒంగోలు ఎంపీ సీటు విషయంపై లోతుగా చర్చించారు. ఎన్ని మాట్లాడినప్పటికీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ఇచ్చి తీరాల్సిందేనని మరోసారి తేల్చిచెప్పారు. మాగుంటకు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకే నష్టమని సజ్జల, విజయసాయికి బాలినేని తేల్చి చెప్పేశారు. ఎంపీ టికెట్ విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని.. మొదట్నుంచీ తాను ఈ మాటే చెబుతున్నానని పెద్దలకు చెప్పారు. దీంతో ఇక చేసేదేమీ లేక బాలినేని ముందు రెండు ప్రపోజల్స్‌ను పెద్దలు ఉంచడం జరిగింది. మరోవైపు.. అయితే కుమారుడికి టికెట్ ఇస్తే.. గెలుపు బాధ్యత నెత్తికెత్తుకుంటా అని అధిష్టానానికి బాలినేని చెప్పినట్లు నిన్నటి నుంచి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Balineni-Srinivasa-Reddy.jpg

ఫైనల్‌గా ఇలా..!

మధ్యే మార్గంగా బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డికి ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని సజ్జల ప్రతిపాదించారు. దీనికి బాలినేని నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఎంపీ టికెట్ మాత్రం మాగుంటకు ఇచ్చే ప్రసక్తే లేదని చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని విజయసాయి.. బాలినేనికి చెప్పారు. అయితే.. ఈ ప్రతిపాదనను మాత్రం తాను అస్సలు ఒప్పుకోనని బాలినేని చెప్పేశారు. చివరగా.. మాగుంటకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోతే ఎంపీ కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని బాలినేని కోరారు. ఈ ప్రతిపాదనకు కూడా వైసీపీ పెద్దలు నో చెప్పేశారు. గంటసేపు చర్చలు జరిగినప్పటికీ కొలిక్కిరాలేదు. దీంతో బాలినేని ఇంటి నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు వైసీపీ పెద్దలు వెళ్లిపోయారు. గంటసేపు జరిగిన భేటీలో చర్చకొచ్చిన విషయాలు, మాగుంట టికెట్ విషయంపై సీఎం జగన్‌తో సజ్జల, విజయసాయి చర్చించి ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. బాలినేని తగ్గేదేలే అంటే.. హైకమాండ్ మాత్రం ఆఫ్షన్స్‌తో మంతనాలు జరుపుతోంది. ఇక.. ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో జగన్ మనసులో ఏముందో.. లెక్క ఎప్పుడు తేలుతుందా అని ప్రకాశం జిల్లా ప్రజలు, వైసీపీ వీరాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Magunta-1.jpg

YSRCP: పాపం బాలినేని.. సీఎంవోకు వచ్చి కారు దిగకుండానే రిటర్న్.. ఏం జరిగిందో..!?


మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2024 | 05:51 PM