Share News

YSRCP: పాపం బాలినేని.. సీఎంవోకు వచ్చి కారు దిగకుండానే రిటర్న్.. ఏం జరిగిందో..!?

ABN , Publish Date - Jan 29 , 2024 | 06:37 PM

Balineni Sreenivas Issue: సీఎంవో నుంచి ఎవరికెప్పుడు కబురు వస్తుందో..? సీఎంతో, వైసీపీ పెద్దలతో భేటీలో ఏం జరుగుతుందో అనేది ఒకింత భయపడిపోతున్నారట. ఇలా సీఎంవో నుంచి పిలుపు రావడంతో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి (Balineni Sreenivasa Reddy) ఘోర అవమానం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

YSRCP: పాపం బాలినేని.. సీఎంవోకు వచ్చి కారు దిగకుండానే రిటర్న్.. ఏం జరిగిందో..!?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSR Congress) ఏం జరుగుతోందో సొంత పార్టీ సిట్టింగులు, నేతలు, కార్యకర్తలకు తెలియని పరిస్థితి. ఎప్పుడు ఇంచార్జులను నియమిస్తారో..? ఎవర్ని తీసేసి.. ఇంకెవర్ని కొత్త వ్యక్తులను తమ నియోజకవర్గానికి నియమిస్తారో అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్‌తోనే బతికేస్తున్నారు. మరోవైపు.. సీఎంవో నుంచి ఎవరికెప్పుడు కబురు వస్తుందో..? సీఎంతో, వైసీపీ పెద్దలతో భేటీలో ఏం జరుగుతుందో అనేది ఒకింత భయపడిపోతున్నారట. ఇలా సీఎంవో నుంచి పిలుపు రావడంతో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి (Balineni Sreenivasa Reddy) ఘోర అవమానం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.


Balineni-Happy.jpg

ఏం జరిగింది..?

సీఎంవో (AP CMO) నుంచి ఫోన్ కాల్ రావడంతో బాలినేని హుటాహుటిన వెళ్లారు. అయితే.. సడన్‌గా ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. నిమిషాల వ్యవధిలోనే తిరుగుపయనం అయ్యారు. కనీసం వచ్చిన కారు కూడా దిగకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో అసలేం జరిగింది..? సీఎంవోకు రమ్మని చెప్పి.. చివరి నిమిషంలో అపాయిట్మెంట్ ఏమైనా రద్దు చేశారా..? లేకుంటే మరేదైనా జరిగిందా..? అనేది తెలియరాలేదు. అయితే.. ఈయనతోపాటు వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు నేరుగా సీఎంవో లోపలికి వెళ్తున్నారు కానీ.. బాలినేని మాత్రం ఎందుకో లోనికి వెళ్లలేదో తెలియట్లేదు. దీంతో ఏదో జరిగిందని మాత్రం పక్కాగా అర్థం అవుతోంది కానీ.. బయటికి మాత్రం అసలు విషయం పొక్కట్లేదు. ఈ ఘటనపై బాలినేని అభిమానులు, అనుచరులు మాత్రం సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం రగిలిపోతున్నారు.

మరోవైపు.. సీఎంవో నుంచి ఎలాంటి పిలుపు రాకుండానే ఒంగోలు ఎంపీ టికెట్ విషయమై తేల్చడానికి నేరుగా బాలినేని వచ్చారని.. జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) బిజీగా ఉన్నారని కలవడం కుదరదని చెప్పారట. దీన్ని అవమానంగా భావించిన మాజీ మంత్రి సీఎంవో దగ్గర ఒక్క నిమిషం కూడా వేచి చూడకుండా వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.


Balineni-Sreenivas.jpg

అయ్యో బాలినేని..?

రెండో దఫా మంత్రివర్గ విస్తరణ మొదలుకుని నేటి వరకూ బాలినేని (Balineni) విషయంలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయం తెలిసిందే. ఆఖరికి బాలినేనికి ఒంగోలు టికెట్ వస్తుందో రాదో కూడా సరిగ్గా క్లారిటీ లేని పరిస్థితి. ఎలాగో టికెట్ విషయం అయితే క్లారిటీ వచ్చింది కానీ.. జిల్లాలో పేరుగాంచిన, వైసీపీ కీలక నేతగా ఉన్నప్పటికీ నియోజకవర్గాల ఇంచార్జులను నియమించే సమయంలో కనీసం సంప్రదించనే లేదు. ఇప్పుడు కూడా ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో జగన్ వర్సెస్ బాలినేనిగా పరిస్థితులున్నాయి. మళ్లీ మాగుంట శ్రీనివాసరెడ్డికే (Magunta Sreenivasulu Reddy) టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబట్టగా.. ఇచ్చే ప్రసక్తే లేని సీఎం.. ఇలానే గత నెలరోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మాగుంట ఎపిసోడ్‌లోకి.. ఒంగోలు ఎంపీ బరిలోకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రి రోజా కూడా వచ్చారు. రోజుకో పేరు తెరపైకి వస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ ఈ వ్యవహారానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడలేదు. దీంతో మాగుంట.. తన కుమారుడితో కలిసి టీడీపీ కండువా కప్పుకోవడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడీ విషయమై ఫైనల్‌గా తేల్చుకోవాలని బాలినేని వచ్చారట. దీనిపై సీఎంవో నుంచి లేదా.. బాలినేని నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.

Minister-Balineni-Srinivas-.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


ఇవి కూడా చదవండి


AP Politics: రోజా ఒంగోలు ఎంపీగా పోటీచేస్తే.. ‘నగరి’ పరిస్థితేంటి.. ఇక్కడ్నుంచి పోటీ ఎవరు..!?


YSRCP: మాకొద్దు బాబోయ్.. అని దండం పెట్టిన అలీ, వినాయక్.. తెరపైకి సుమన్!


Updated Date - Jan 29 , 2024 | 06:48 PM