Share News

Jayaho BC Live Updates: బీసీ డిక్లరేషన్ వచ్చేసిందహో.. 50 ఏళ్లకే పెన్షన్

ABN , First Publish Date - Mar 05 , 2024 | 04:39 PM

Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి జోరు పెంచింది. ఇప్పటికే ‘రా కదలి రా..’, ‘శంఖారావం’ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు చేరువైన టీడీపీ.. ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో బీసీల సమగ్రాభివృద్ధి, సంరక్షణ కోసం బీసీ డిక్లరేషన్‌‌ను కూటమి విడుదల చేయబోతోంది. ఇందుకోసం ‘జయహో బీసీ’ (Jayaho BC) సదస్సు మంగళగిరిలో జరుగుతోంది..

Jayaho BC Live Updates: బీసీ డిక్లరేషన్ వచ్చేసిందహో.. 50 ఏళ్లకే పెన్షన్

Live News & Update

  • 2024-03-05T19:45:31+05:30

    ఎంపీ టికెట్ ఇస్తామన్నా వచ్చేశారు!

    • బీసీల్లో ఉన్న 157 కులాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం

    • అచ్చెన్న, కొల్లు, యనమల, కళా వెంకట్రావుపై అక్రమ కేసులు పెట్టారు

    • బీసీ నాయకత్వంపై గొడ్డలివేటు వేసిన పార్టీ వైసీపీ

    • ఎంపీ టికెట్‌ ఇస్తామన్నా వదులుకుని గుమ్మనూరు టీడీపీలోకి వచ్చారు

    • బీసీలను ఊచకోత కోసే పల్నాడు వైసీపీ నేతలను మార్చగలమా?

    • రాష్ట్రంలో నలుగురు రెడ్లతో పెత్తందారి వ్యవస్థను నడుపుతున్నారు

    • సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు జగన్‌రెడ్డికి లేదు: చంద్రబాబు

    Chandrababu.jpg

  • 2024-03-05T19:45:19+05:30

    మాటిస్తున్నా.. నెరవేరుస్తా!

    • బీసీ డిక్లరేషన్ తర్వాత చంద్రబాబు ప్రసంగం

    • బీసీ కులాలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్ అమలు

    • పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంపు

    • బీసీలకు ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్ల మేర కేటాయింపులు చేస్తాం

    • స్థానిక సంస్థల ఎన్నికల్లో కోత వేసిన రిజర్వేషన్లను పునరుద్దరిస్తాం

    • స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను రద్దు చేస్తాం

    • బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం

    • ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు ప్రత్యేక చట్టం

    • బీసీ పారిశ్రామిక వేత్తల ప్రొత్సహానికి రూ. 10 వేల కోట్ల కేటాయింపు

    • షరతుల్లేకుండా విదేశీ విద్యను అమలు చేస్తాం

    • పీజీ విద్యార్థులకు ఫీజు రీ-ఎంబర్సుమెంట్ పునరుద్దరిస్తాం

    • బీసీల కోసం రూ. 10 లక్షలతో చంద్రన్న కానుక

    • పెళ్లి కానుక తిరిగి ప్రవేశపెడతాం

    • ప్రతేడాది కుల ధృవీకరణ తీసుకునే వ్యవస్థలను రద్దు చేస్తాం..

    • శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తాం.. : చంద్రబాబు

    CBN-Latest.jpg

  • 2024-03-05T19:30:00+05:30

    బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ!

    • బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉంది

    • బీసీల రుణం తీర్చుకునేందుకే బీసీ డిక్లరేషన్‌ తెచ్చాం

    • బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్‌

    • పెన్షన్‌ను నెలకు రూ.4 వేలకు పెంచుతాం

    • బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తాం

    • సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్ల కేటాయిస్తాం

    • వైసీపీ పాలనలో సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించారు

    • బీసీ డిక్లరేషన్‌ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి

    • రిజర్వేషన్‌ తగ్గింపుతో 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారు

    • ఎవరికైనా పదవులు దక్కకుంటే నామినేటెడ్‌ పదవులు ఇస్తాం

    • బీసీల ఆర్థిక పరిస్థితుల అధ్యయనం, చట్టబద్ధంగా కులగణన

    • బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తాం

    • బీసీల జోలికి ఎవరైనా వస్తే జాగ్రత్త.. అని హెచ్చరిస్తున్నాం

    • పరిశ్రమలు పెట్టేలా బీసీ వర్గాలకు ప్రోత్సహిస్తాం

    • బీసీలకు షరతులు లేకుండా విదేశీవిద్య పథకం

    • చంద్రన్న బీమా కింద బీసీలకు రూ.10 లక్షలు

    • లంచాలు లేకుండా బీసీలకు ధ్రువపత్రాలు ఇచ్చేలా చూస్తాం

    • ఏడాదిలోగా బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేస్తాం

    • బీసీల దశ, దిశ మార్చడం కోసమే బీసీ డిక్లరేషన్‌ ఇచ్చాం

    • బీసీలు లేకుంటే ముందుకెళ్లదు.. నాగరికతకు వారే మూలం

    • చెరువులు, దోబీఘాట్‌లపై మళ్లీ హక్కు కల్పిస్తాం

    • పరిశ్రమలు పెట్టేలా కురబ, యాదవులను ప్రోత్సహిస్తాం: చంద్రబాబు

    CBN.jpg

  • 2024-03-05T19:15:59+05:30

    నేనేం తప్పు చేశా.. ఎందుకు జైల్లో పెట్టారు!

    • పల్లకీలు మోసే బీసీలను ఎన్టీఆర్ పల్లకీలు ఎక్కించారు

    • జయహో బీసీ సభలో టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు

    • ఎన్టీఆర్ వల్లే బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్ధిక లబ్ది చేకూరింది

    • ఎన్ని కష్టాలు వచ్చినా బీసీలు టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నాయి

    • బీసీలు టీడీపీకి అండగా ఉంటారని.. జగన్ బీసీలను అణిచేస్తున్నారు

    • బీసీలు గెలవాలంటే టీడీపీ - జనసేన గెలవాలి

    • నేనేం తప్పు చేశాను.. నన్నెందుకు జైల్లో పెట్టారు

    • నేను అవినీతి చేశానని నిరూపిస్తే తల తీసేసుకోవడానికి సిద్దం

    • జగన్ చేసింది తప్పంటే.. జైల్లో పెడుతున్నారు

    • బీసీలకు గళమెత్తే అర్హత లేదా..?

    • ఐదేళ్లల్లో బీసీలకు ఒక్క మేలైనా జరిగిందా..?

    • జగన్ పెట్టిన కార్పేరేషన్లు నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావు

    • ఆదరణ పరికరాలు తుప్పు పట్టేలా చేస్తున్నారు కానీ..

    • బీసీలకు మాత్రం ఆ పరికరాలు ఇవ్వడం లేదు : అచ్చెన్నాయుడు

    Atchanna.jpg

  • 2024-03-05T19:15:00+05:30

    ఇదిగో బీసీ డిక్లరేషన్..

    బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

    10 అంశాలతో బీసీ డిక్లరేషన్ విడుదల

    1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం

    5 పెన్షన్‌ను నెలకు రూ.4 వేలకు పెంచుతాం

    2. ప్రత్యేక రక్షణ చట్టం: జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురయ్యారు.

    బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి రక్షణ కోసం 'ప్రత్యేక రక్షణ చట్టం' తీసుకొస్తాం

    ఎ) సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం.

    3. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.

    ఎ) వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించింది. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

    4. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ను వైసీపీ ప్రభుత్వం 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి, 16,800 పదవులు దూరం చేశారు. అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం.

    ఎ) చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.

    బి) అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అమలు.

    సి) తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం.

    5. ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం

    ఎ) జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.

    బి) దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.

    సి) స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.

    డి) జగన్రెడ్డి 'ఆదరణ' లాంటి 30 పథకాలు రద్దు చేశారు. రూ.5000 కోట్లతో 'ఆదరణ' పరికరాలిస్తాం.

    ఈ) మండల/నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్, ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం.

    ఎఫ్) జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం.

    6. చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం

    7. చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్దరిస్తాం. పెళ్లి కానుకలు రూ. లక్షకు పెంపు

    8. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.

    9. విద్యా పథకాలు అన్నీ పునరుద్దరిస్తాం

    ఎ) నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం.

    బి) షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం.

    సి) పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్దరిస్తాం.

    డి) స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంబిస్తాం.

    10. బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం.

    BC-Declaration.jpg

  • 2024-03-05T19:02:53+05:30

    మా ప్రాణాలు అడ్డేస్తాం..!

    • బీసీలపై దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డు వేస్తాం

    • జయహో బీసీ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్

    • జగన్ చేస్తున్న అక్రమాలపై వైసీపీలోని బీసీ నేతలు ఆలోచించాలి

    • బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించకుంటే..

    • బీసీ కులాలకు అన్యాయం చేసినట్టేనని వైసీపీ బీసీ నేతలు ఆలోచించాలి

    • బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి

    • బీసీల కోసం ఏడాదికి రూ. 75 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ అది సున్నా

    • శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు హామీని గాలికి వదిలేశారు

    • అమర్నాధ్ గౌడ్ అనే కుర్రాడిని పెట్రోల్ పోసి చంపేశారు

    • భారత దేశ సంస్కృతిని కాపాడేది బీసీలే

    • వడ్డెర్లకు ఆర్థికంగా బలం చేకూరేలా చేస్తాం

    • పల్లెకార్ల కులాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం

    • గంగవరం పోర్టు నిర్వాసితులు సహా అందరికీ న్యాయం చేస్తాం

    • తీర ప్రాంతంలో ప్రతి 30 కిలో మీటర్లకు ఓ జెట్టి ఉండేలా చర్యలు తీసుకుంటాం

    • బీసీల దగ్గర డబ్బు ఉండకూడదని జగన్ జీవోలు తెచ్చారు

    • 153 బీసీ కులాలకు జనసేన అండగా ఉంటాం

    • బీసీలు ఐక్యంగా ఉంటే.. ఎవ్వరూ ఏం చేయలేరు

    • బీసీలకు ఎన్టీఆర్ అధికారం కల్పిస్తే..

    • జగన్ వచ్చీ రాగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లల్లో 10 శాతం కోత విధించారు : పవన్

    Pawan-Kalyan.jpg

  • 2024-03-05T19:00:25+05:30

    పోలా.. అదిరిపోలా..!

    • జయహో బీసీ సభలో జనసేన అధినేత పవన్ ప్రసంగం

    • అదిరిపోయే ప్రసంగం ఇస్తున్న జనసేనాని

    • పవన్ ప్రసంగంతో ఈలలు, కేకలు హోరెత్తిస్తున్న కార్యకర్తలు, వీరాభిమానులు

    Pawan-Speech.jpg

  • 2024-03-05T18:55:04+05:30

    మాటిస్తున్నా.. చేసి చూపిస్తా!

    • జగన్‌ పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం

    • నా పాదయాత్రలో బీసీల సమస్యలు తెలుసుకున్నా

    • చేనేతలకు ఇచ్చే అనేక పథకాలను వైసీపీ సర్కార్‌ రద్దు చేసింది

    • ఓడినా మంగళగిరిలోనే ఉన్నా.. అనేక కార్యక్రమాలు చేపట్టా

    • మంగళగిరికి ఇచ్చిన హామీలేవీ వైసీపీ నిలబెట్టుకోలేదు

    • నేను గెలిచాక మంగళగిరి ప్రజల సమస్యలు పరిష్కరిస్తా

    • బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.75 వేల కోట్లను పక్కదారి పట్టించారు

    • వైసీపీ సర్కార్‌ వచ్చాక ఆప్కాబ్‌ను నిర్వీర్యం చేసింది

    • బీసీ నేతలపైనే అనేక కేసులు పెట్టారు.. వేధించారు

    • బీసీలంటే జగన్‌కు చిన్నచూపు.. అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వరు

    • బీసీలకు అనేక పదవులు ఇచ్చిన పార్టీ టీడీపీనే

    • బీసీల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి ఉంది: నారా లోకేశ్‌

    Lokesh-Mangalagiri.jpg

  • 2024-03-05T18:45:30+05:30

    50వేల మెజార్టీతో గెలుస్తా.. వడ్డీతో కలిపి ఇచ్చేస్తా!

    • బీసీ అంటే భరోసా, బీసీ అంటే బాధ్యత

    • జయహో బీసీ సభలో నారా లోకేష్ అదిరిపోయే స్పీచ్

    • బీసీలంటే బలహీన వర్గాలు కాదు.. బలమైన వర్గాలు

    • బీసీల్లో ఉపకులాల వారీగా సాధికారత కమిటీలు వేశాం

    • బీసీ ఉపకులాల్లో యువ నాయకత్వం పెంచేలా టీడీపీ ప్రొత్సాహిస్తుంది

    • బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేశాం..

    • స్థానిక సంస్థల బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీనే

    • బీసీలకు విదేశీ విద్యను అందించాం

    • జగన్ బీసీల వెన్ను విరిచాడు

    • బీసీలకిచ్చిన అసైన్డ్ భూములను జగన్ లాక్కున్నాడు

    • చేనేత, మత్స్యకారులను వేధింపులే

    • చాలా మంది బీసీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారు

    • బీసీ నేతలపై కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. ఆ ఎఫ్ఐఆర్‌ను మడిచి పెట్టుకోండి

    • అధికారంలోకి వచ్చాక కేసులను ఎత్తేస్తాం

    • వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని చాలా మంది వైసీపీ బీసీ నేతలే అంటున్నారు

    • పదో తరగతి కుర్రాడు.. అమర్నాధ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి చంపేశారు

    • పాదయాత్రలో కొండపొరంబోకు సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న..

    • ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న స్థలాలను రెగ్యులరైజ్ చేయాలి

    • పద్మశాలిల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం

    • 53 వేల మెజార్టీతో మంగళగిరిని గెలిచి గిఫ్టుగా ఇస్తాం

    • కరకట్ట కమల్ హాసన్ మళ్లి వచ్చాడు..

    • ఐదేళ్లుగా చాలా మందిని ఇబ్బంది పెట్టారు

    • అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.. : నారా లోకేష్

    Lokesh-At-Jayaho-2.jpg

  • 2024-03-05T18:30:58+05:30

    లోకేష్ ప్రసంగిస్తుడంగా.. చూస్తూ ఉండిపోయిన పవన్

    • జయహో బీసీ సభలో నారా లోకేష్ అదిరిపోయే ప్రసంగం

    • లోకేష్ ప్రసంగం చేస్తుండగా ఈలలు, కేకలతోహోరెత్తించిన జనం

    • లోకేష్ మాట్లాడుతున్నంత సేపు అలాగే చూస్తూ ఉండిపోయిన పవన్

    • యువనేత ప్రసంగిస్తుండగా అలా చూస్తూ ఉండిపోయిన పవన్

    • యువనేత స్పీచ్‌కు పవన్ ఫిదా అయిపోయారంటున్న టీడీపీ శ్రేణులు

    • మునుపటితో పోలిస్తే లోకేష్ ప్రసంగంలో చాలా మార్పులు

    • పంచ్‌లు, ప్రాసలు, డైలాగ్స్‌తో దుమ్మురేపే స్పీచ్ ఇచ్చిన లోకేష్

    Lokesh-And-Pawan.jpg

  • 2024-03-05T18:20:56+05:30

    అవును.. టీడీపీనే!

    • బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే

    • జయహో బీసీ సభలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

    • ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రభావం ఎక్కువేతే...

    • నష్టపోయేది బలహీన వర్గాల ప్రజలే..: యనమల

    Yanamala.jpg

  • 2024-03-05T18:15:33+05:30

    టీడీపీలో చేరిన మాజీ మంత్రి జయరాం

    • టీడీపీలో చేరిన మాజీ మంత్రి జయరాం

    • చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం

    • మంత్రితో పాటు పలువురు ముఖ్యనేతలు సైకిలెక్కిన వైనం

    • మంగళవారం ఉదయమే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి

    • టికెట్ విషయంలో సీఎం జగన్ వర్సెస్‌ మంత్రిగా పరిస్థితి

    • సీన్ కట్ చేస్తే రాజీనామా.. ఇవాళ టీడీపీలో చేరిక

    Jayaram-TDP.jpg

  • 2024-03-05T18:00:27+05:30

    ఒకేసారి అభివాదం!

    • సభకు విచ్చేసిన కార్యకర్తలు, నేతలకు అభివాదం

    • ఒకేసారి అభివాదం చేసిన చంద్రబాబు, పవన్

    • ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరూ కనిపించడంతో ఈలలు, కేకలతో హోరెత్తించిన కార్యకర్తలు

    • గెలుపు మనదే.. కొట్టేస్తున్నాం.. వైసీపీ కోటలు కూలిపోతున్నాయ్ అంటూ నినాదాలు

    Pawan-And-Chandrababu-Sabha.jpg

  • 2024-03-05T17:58:45+05:30

    జగన్.. ఏమిటీ చిచ్చు..!

    • వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు

    • జయహో బీసీ సభలో మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ

    • ఒక్క అవకాశమని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు

    • వెనుకబడిన వర్గాల్లో జగన్‌ చిచ్చు పెడుతున్నారు

    • జగన్‌ సర్కార్‌ బీసీ నేతలను భయపెట్టి వేధిస్తుంది

    • వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగడం లేదు

    • భూములు ఇచ్చిన అమరావతి రైతులను రోడ్డుపైకి తెచ్చారు

    Konathala.jpg

  • 2024-03-05T17:56:56+05:30

    మాదే శాసనం!

    • రాజకీయ పార్టీల భవిష్యత్తును శాసించేది బీసీలే

    • జయహో బీసీ సభలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ

    • మొదట్నుంచీ బీసీలకు టీడీపీనే అండ

    • కార్పొరేషన్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది

    • బీసీ కార్పొరేషన్లకు కుర్చీలు లేవు.. నిధులు లేవు

    Pithani-Satya-Narayana.jpg

  • 2024-03-05T17:55:08+05:30

    సూర్యచంద్రుల్లా నడిపిస్తారు!

    • ఏపీని సూర్యచంద్రుల్లా చంద్రబాబు, పవన్‌ నడిపిస్తారు

    • టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ సభలోఎంపీ రామ్మోహన్ నాయుడు

    • బీసీల కష్టంతోనే దేశం ముందుకు నడుస్తోంది

    • బీసీలను పల్లకి ఎక్కించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది

    • బీసీలను ముందుకు నడిపించిన ఘనత టీడీపీదే

    • విదేశీవిద్య ద్వారా బీసీలు విదేశాల్లో చదువుకునే అవకాశం వచ్చింది

    • వైసీపీ పాలనలో బీసీలే ఎక్కువగా నష్టపోయారు

    • బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను జగన్‌ దారి మళ్లించారు, ఆదరణ ఆపేశారు

    • నా బీసీలు అనే హక్కు జగన్‌రెడ్డికి లేదు: ఎంపీ రామ్మోహన్‌

    Rammohan-Naidu.jpg

  • 2024-03-05T17:45:36+05:30

    డిక్లరేషన్‌లో ఏముంటుందో.. ఏమో..?

    • బీసీ డిక్లరేషన్‌లో ఏముంటుందో అని ప్రకటన కోసం వైసీపీ ఎదురుచూపులు

    • కాసేపట్లో డిక్లరేషన్ ప్రకటించనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

    • ఈ డిక్లరేషన్‌తో బీసీలంతా కూటమివైపే ఉంటారని భావిస్తున్న పార్టీ వర్గాలు

    • ప్రకటన ఎప్పుడొస్తుంది.. అందులో ఏమేం ఉంటాయని వైసీపీ హైకమాండ్ గుసగుసలు

    • జయహో బీసీ సభ.. డిక్లరేషన్‌ దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్‌ వణుకోతందంటున్న టీడీపీ, జనసేన

    YSRCP-To-TDP-Flags.jpg

  • 2024-03-05T17:35:20+05:30

    వైసీపీది సవతి ప్రేమ!

    • బీసీల ద్రోహి సీఎం వైఎస్ జగన్ రెడ్డి

    • టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ సభలో జనసేన నేత పోతిన మహేష్

    • నా బీసీ.. నా బీసీ అని మాట్లాడటానికి నీకు ఏం అర్హత ఉంది జగన్ రెడ్డి.. ?

    • రాష్ట్రంలోని బీసీలంతా టీడీపీ, జనసేనతోనే ఉన్నారు

    • ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీల కోసం ఒక్క కొత్త పథకమైనా ప్రవేశపెట్టారా..?

    • ఆదరణ, పెళ్లికానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు ఎందుకు రద్దయ్యాయో జగన్ చెప్పాలి

    • స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 10 శాతం కోతపెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి

    • బీసీలను టీడీపీ–జనసేన సొంత బిడ్డల్లా చూస్తుంటే.. వైసీపీ సవతి ప్రేమ చూపిస్తోంది

    • బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించిన నమ్మకద్రోహి జగన్ రెడ్డి

    • తన కూతుళ్లే విదేశాల్లో చదువుకోవాలనే స్వార్ధంతో.. బీసీలకు విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశారు

    • బీసీలు ఆశించే స్థాయి నుంచి.. శాసించే స్థాయికి రావాలని పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారు

    • ఎంపీ పదవి కోసం ఆర్ కృష్ణయ్య .. బీసీల ఆత్మ గౌరవాన్ని , భవిష్యత్‌ను జగన్ దగ్గర తాకట్టు పెట్టారు : పోతిన మహేష్

    Pothina-Mahesh.jpg

  • 2024-03-05T17:30:38+05:30

    ఒక్కరైనా వైసీపీలో ఉన్నారా..?

    • జయహో బీసీ సదస్సులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆసక్తికర వ్యాఖ్యలు

    • టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే బీసీలు అభివృద్ధి చెందారు

    • టీడీపీకి బీసీలు వెన్నుముక.. బీసీల వెన్ను విరుస్తున్న పార్టీ వైసీపీ

    • బీసీల సమస్యలపై పోరాటం చేసే ఒక్క నాయకుడైనా వైసీపీలో ఉన్నారా..?

    • నందం సుబ్బయ్య నుంచి డా. సుధాకర్ వరకు అందర్నీ వైసీపీ నేతలు ఊచకోత కోశారు

    • వైసీపీలో పదవులు బీసీలకు.. అధికారం మాత్రం ఓసీలదే

    • ‘రెడ్డి’ అనే తోక తగిలించుకొని ఆరుగురు రెడ్లు అధికారం చెలాయిస్తున్నారు

    • మత్స్యకార మంత్రి ఒక్క మత్స్య కారుడికి నష్టపరిహారం ఇవ్వలేదు

    • బీసీలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు, పవన్ నాయకత్వం అధికారంలోకి రావాలి

    • ప్రతి ఒక్క బీసీ 100 మందితో టీడీపీకి ఓటు వేసేలా తీర్చిదిద్దాలి

    Gouthu-Sireesha.jpg

  • 2024-03-05T17:27:37+05:30

    గబ్బర్‌సింగ్ రేంజ్‌లో ఎంట్రీ..!

    • జయహో బీసీ సభకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

    • కారు నుంచి దిగుతూ గబ్బర్ సింగ్ రేంజ్‌లో సినిమాటిక్‌గా ఎంట్రీ!

    • సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్

    • సేనానికి సాగర స్వాగతం పలికిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇతర టీడీపీ.. జనసేన నేతలు

    Pawan-Jayaho-BC.jpg

  • 2024-03-05T17:25:10+05:30

    వెల్కమ్ జయరాం..!

    • టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మంత్రి జయరం

    • బాబుకు పుష్పగుచ్చం అందజేసి.. శాలువాతో సత్కరించిన జయరాం

    • కాసేపట్లో చంద్రబాబు, పవన్ సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్న మంత్రి

  • 2024-03-05T17:20:00+05:30

    బీసీ డిక్లరేషన్‌లో ఏముంటుంది..?

    • కాసేపట్లో చంద్రబాబు, పవన్ చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్

    • డిక్లరేషన్‌లో ఏముంటుందో అని రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా ఆసక్తి

    • ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని టీవీలు, యూట్యూబ్‌లకు అతుక్కుపోయిన జనం

    • కీలక ప్రకటనలే ఉంటాయని చెబుతున్నా టీడీపీ వర్గాలు

    • ఈ ప్రకటనతో వైసీపీకి మరో గట్టి దెబ్బేనని చెబుతున్న జనసేన వర్గాలు

    • టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే..

    • బీసీలకు ఏం చేస్తామనే విషయాలను డిక్లరేషన్‌లో పొందుపరిచిన పార్టీలు

    Jayaho-BS-Sabha-Janam.jpg

  • 2024-03-05T17:10:28+05:30

    సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు

    • ‘జయహో బీసీ’ సదస్సు ప్రాంగణానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

    • బాబుకు సాదర స్వాగతం పలికిన కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, టీడీపీ ముఖ్య నేతలు

    • ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు

    • చంద్రబాబు రాకతో ఈలలు.. కేకలు.. నినాదాలతో హోరెత్తించిన పసుపు-జనసైన్యం!

    Nara-Lokesh-Entry.jpg

  • 2024-03-05T17:00:10+05:30

    జయహో సభకు వైసీపీ మంత్రి..!

    • జయహో బీసీ సదస్సు ప్రాంగణానికి చేరుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం

    • చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ సమక్షంలో టీడీపీలో జయరాం చేరిక

    • మంగళవారం ఉదయమే వైసీపీకి గుమ్మనూరు రాజీనామా

    • కర్నూలు ఎంపీగా పోటీచేయమని సీఎం జగన్ ఆదేశించడంతో..

    • ఎమ్మెల్యేగా మాత్రమే పోటీచేస్తానని చెప్పిన జయరాం

    Gummanur-Jayaram.jpg

  • 2024-03-05T16:47:53+05:30

    ప్రారంభమైన ‘జయహో బీసీ’ సభ

    • మంగళగిరిలో ప్రారంభమైన ‘జయహో బీసీ’ సదస్సు

    • సభ వేదికకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

    • వేదికపై ముఖ్య అతిథులు కోసం ప్రత్యేకంగా 325 కుర్చీలు ఏర్పాటు

    • కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్‌లో సభా వేదిక వద్దకు రానున్న టీడీపీ అధినేత చంద్రబాబు

    • జనసేన కార్యాలయం వద్ద నుంచి రోడ్డు మార్గాన రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

    CBN-And-Pawan-Jayahp.jpg

  • 2024-03-05T16:45:35+05:30

    వావ్.. లోకేష్ ఎంట్రీ చూశారా..?

    • జయహో బీసీ సభకు విచ్చేసిన యువనేత నారా లోకేష్

    • లోకేష్‌ను చూసి యువత, కార్యకర్తలు.. నేతల కేరింతలు

    • కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ లోకేష్ గ్రాండ్ ఎంట్రీ

    • సభా ప్రాంగణంలో ఎటు చూసినా టీడీపీ, జనసేన జెండాలే..

    • స్టేజీపైన ఆశీనులైన బీసీ నేతలందరితో లోకేష్ కరచాలనం

    Lokesh.jpg

  • 2024-03-05T16:30:06+05:30

    ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ-జనసేన TDP-Janasena కూటమి జోరు పెంచింది. ఇప్పటికే ‘రా కదలి రా..’, ‘శంఖారావం’ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు చేరువైన టీడీపీ.. ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో బీసీల సమగ్రాభివృద్ధి, సంరక్షణ కోసం బీసీ డిక్లరేషన్‌‌ను కూటమి విడుదల చేయబోతోంది. ఇందుకోసం ‘జయహో బీసీ’ (Jayaho BC) సదస్సు మంగళగిరిలో జరుగుతోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు ఎటువంటి న్యాయం చేస్తారనే దానిపై ఈ సదస్సు వేదికగా డిక్లరేషన్ ఇవ్వనున్నారు. చంద్రబాబు, పవన్ కలిసి బహిరంగ సభల్లో పాల్గొనడం ఇది రెండోసారి. దీంతో అధినేతల ప్రసంగం ఎలా ఉండబోతోందా అని అటు జనసేన.. ఇటు టీడీపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ‘జయహో బీసీ’ సభను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) లైవ్‌లో చూసేయండి..