Share News

Kavitha Arrest: కవిత అరెస్ట్‌.. దెబ్బకు చంద్రబాబును గుర్తుతెచ్చుకున్న కేటీఆర్!

ABN , Publish Date - Mar 15 , 2024 | 10:33 PM

KTR Remembers Chandrababu: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ అరెస్టుపైనే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది. ఇదంతా అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్.. అబ్బే మాకేం సంబంధం లేదని బీజేపీ చెప్పుకుంటున్నాయ్.

Kavitha Arrest: కవిత అరెస్ట్‌.. దెబ్బకు చంద్రబాబును గుర్తుతెచ్చుకున్న కేటీఆర్!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ అరెస్టుపైనే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది. ఇదంతా అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్.. అబ్బే మాకేం సంబంధం లేదని బీజేపీ చెప్పుకుంటున్నాయ్. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు కవిత చేరుకోనున్నారు. అటు కవిత ఢిల్లీకి తీసుకెళ్తుండటంతో.. ఇటు మాజీ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ (KTR) కూడా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ గ్యాప్‌లో కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కవిత అరెస్ట్‌ దెబ్బకు.. టక్కున టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో కేంద్రం తీరును ఎండగడుతూ.. కేంద్రంలోని దర్యాప్తు సంస్థలపై బాబు చేసిన సంచలన ట్వీట్‌ను వెతికి మరీ కేటీఆర్ రీట్వీట్ చేశారు.

కవిత అరెస్ట్‌కు ముందు.. ఆ తర్వాత ఏం జరిగింది..?


KTR-And-Kavitha.jpg

ఇదీ ట్వీట్ సారాంశం..!

ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ.. ప్రతిపక్షాలపై ఉసిగొల్పి హింసిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి-15న 2019లో బాబు ఈ ట్వీట్‌ చేశారు. అంతేకాదు.. బీజేపీ ఇంకా ఎంత దిగజారుతుంది..? అంటూ ఆ ట్వీట్‌లో చంద్రబాబు ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌నే కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. చూశారు కదా బీజేపీ పరిస్థితిని చంద్రబాబు చాలా చక్కగా చెప్పారని.. ఇంతకుమించి తాను చెప్పడానికి ఇంకేం లేదని ఎక్స్‌లో రాసుకొచ్చారు. మరో ట్వీట్‌లో.. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధిస్తోంది. కేసు కోర్టు పరిధిలో ఉన్నా ఈడీ నిబంధనలు పాటించలేదు. న్యాయపరంగా పోరాడుతాం. కచ్చితంగా న్యాయం గెలుస్తుందిఅని కేటీఆర్ ట్వీట్ చేశారు.

babu7.jpg

ఇప్పుడిదే హాట్ టాపిక్!

ఈ రెండు ట్వీట్లకు పెద్ద ఎత్తున కామెంట్స్.. అంతకుమించి రీట్వీట్లు వస్తున్నాయి. దెబ్బకు చంద్రబాబు గుర్తొచ్చారన్న మాట అంటూ టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు నెట్టింట్లో కవిత అరెస్ట్ కంటే ఈ ట్వీట్ గురించే చిత్ర విచిత్రాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అటు టీడీపీ అభిమానులు కౌంటర్ల వర్షం కురిపిస్తుండగా.. ఇటు బీఆర్ఎస్ ఒకింత కౌంటర్ ఎటాక్ కూడా చేస్తోంది. అంతేకాదు.. చంద్రబాబు అరెస్ట్ సమయంలో నిరసనలు, ధర్నాలకు నాటి బీఆర్ఎస్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడాన్ని ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. బాబు అరెస్ట్ తర్వాత ఐటీ ఉద్యోగులు, తెలంగాణలోని ఆంధ్రులు నిరసన తెలపడానికి అనుమతివ్వాలని కేటీఆర్‌కు నారా లోకేష్ కాల్ చేయగా.. నాడు మంత్రిగా ఉన్న ఈయన ఒప్పుకోలేదన్న విషయం తెలిసిందే.

KTR-At-Kavitha-Home.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 10:45 PM