Share News

Kavitha Arrest Live Updates: కవిత అరెస్ట్‌కు ముందు.. ఆ తర్వాత ఏం జరిగింది..?

ABN , First Publish Date - Mar 15 , 2024 | 06:36 PM

MLC Kavitha Arrest: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఏకకాలంలో ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను అదుపులోనికి తీసుకోవడం జరిగింది.

Kavitha Arrest Live Updates: కవిత అరెస్ట్‌కు ముందు.. ఆ తర్వాత ఏం జరిగింది..?

Live News & Update

  • 2024-03-15T22:30:54+05:30

    కవిత కేసు వాయిదా..!

    • కవిత అరెస్ట్, సుప్రీంకోర్టులో విచారణపై స్పందించిన లాయర్ మోహిత్ రావు

    • కవిత కేసును సుప్రీంకోర్టులో వాదిస్తున్న మోహిత్ రావు

    • కవిత కేసు మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది

    • గతంలో కవితపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోమని ఈడీ చెప్పింది

    • చట్ట విరుద్ధంగా ఈడీ వ్యవహరించింది.. కవిత అరెస్ట్ చట్ట విరుద్ధం

    • సుప్రీంకోర్టులో కేసు పూర్తయ్యే వరకు ఈడీ చెప్పిన బలవంతపు చర్యలు తీసుకోమనే అంశం వర్తిస్తుంది

    • ముందస్తు ప్లాన్‌లో భాగంగా కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు

    • సోదాల పేరుతో వచ్చి అరెస్ట్ చేశారు.. ముందుగానే ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు

    • కవిత ముందు చాలా న్యాయ అవకాశాలు ఉన్నాయి

    • అరెస్ట్‌ను తప్పకుండా సవాల్ చేస్తాం.. చట్ట విరుద్దంగా ఈడీ వ్యవహరించిందని కోర్టుకు వెళ్లొచ్చు

    • న్యాయవ్యాదులతో చర్చించి శనివారం నాడు నిర్ణయం తీసుకుంటాం

    • కోర్టుల పై మాకు నమ్మకం ఉంది.. న్యాయ పోరాటం చేస్తాం

    • ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారు : మోహిత్ రావు

    kavitha.jpg

  • 2024-03-15T22:00:53+05:30

    రేపు ఏం జరుగుతుంది..?

    • కవితను ఢిల్లీ తీసుకెళ్తున్న ఈడీ బృందం

    • ఇవాళ రాత్రికి ఈడీ కార్యాలయంలోనే ఉండనున్న కవిత

    • శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు

    • రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ

    • లిక్కర్‌ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనున్న ఈడీ

    • విచారణకు ఇస్తే ఏం చేయాలి..? లేకుంటే ఎలా అనేదానిపై ఈడీ ప్రిపరేషన్!

    • ఇటు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్

    • నియోజకవర్గాల్లో నిరసనలు తెలిపాలని నేతలకు హరీష్ పిలుపు

    Kavitha.jpg

  • 2024-03-15T21:30:59+05:30

    ఎవరూ నోరు తెరవద్దు..!

    • కవిత అరెస్టుపై ఎవరూ నోరు తెరవద్దు..!

    • బీజేపీ నేతలతో అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్

    • ఈ విషయంలో తొందరపడి మాట్లాడొద్దని ఆదేశం

    • కవిత అరెస్ట్‌కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం

    • కవిత ఎపిసోడ్ తెలంగాణకు సంబంధించి కాదు.. వ్యక్తిగత ఇష్యూ అంటోన్న బీజేపీ

    • మరీ ముఖ్యంగా ఎవరూ ప్రెస్‌మీట్‌లు పెట్టొద్దని నేతలకు కిషన్ రెడ్డి ఆదేశం

      KISHAN-REDDY.jpg

  • 2024-03-15T20:50:03+05:30

    కవిత అరెస్ట్ తర్వాత కీలక పరిణామం!

    • మాజీ మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు చేసిన ఈడీ

    • బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు

    • కవిత అరెస్ట్ సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఈడీ ఫిర్యాదు

    • కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈడీ ఆఫీసర్ భాను ప్రియా మీనా

    • కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం

    • ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈడీ

    • ఢిల్లీకి పయనమైన మాజీ మంత్రి కేటీఆర్

    • ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా రియాక్టవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ

    KTR-At-Kavitha-Home.jpg

  • 2024-03-15T20:45:22+05:30

    చెల్లెమ్మా జాగ్రత్త..!

    • కవిత అరెస్ట్ సమయంలో అక్కడే ఉన్న సోదరుడు కేటీఆర్

    • తీవ్ర భావోద్వేగానికి లోనైన మాజీ మంత్రి!

    • చెల్లెమ్మా జాగ్రత్త.. నేనున్నా అన్నీ చూసుకుంటానని ధైర్యం చెప్పిన అన్న!

    • అటు కవిత బయల్దేరిన వెంటనే.. ఇటు ఢిల్లీకి పయనమైన కేటీఆర్

    • ఇవాళ రాత్రికి ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించనున్న కేటీఆర్

    • అంతకుముందు కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో వాగ్వాదం

    • కవితను ఎలా, ఏ చట్టం కింద అరెస్ట్ చేస్తారని ఈడీతో గొడవ!

    KTR-And-Kavitha.jpg

  • 2024-03-15T20:40:38+05:30

    ఇదంతా కుట్రే..!

    • కవిత అరెస్ట్‌పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రియాక్షన్

    • కవిత అరెస్ట్‌ను రాజకీయ కుట్ర కోణంలోనే చూస్తున్నాం

    • ఏడాదిన్నర తర్వాత కుట్రతో అరెస్ట్ చేశారు

    • బీజేపీ రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా పని చేపించుకుంటోంది

    • అరెస్ట్ చేయమని కోర్టు ముందు చెప్పారు.. దాన్ని తుంగలో తొక్కి అరెస్ట్ చేశారు

    • ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి బీజేపీ ఇలాంటివి చేస్తోంది

    • కవిత నిర్దోషిగా బయటకు వస్తారు

    • రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు బీజేపీ పాల్పడుతోంది

    jagadeesh.jpg

  • 2024-03-15T20:35:38+05:30

    రేపు ఏం జరగబోతోంది..?

    • శనివారం నాడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్న ఈడీ

    • ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన ఈడీ అధికారులు

    • ఇవాళ రాత్రికి ఈడీ కార్యాలయంలోనే ఉండనున్న కవిత

    Kavitha-Airport.jpg

  • 2024-03-15T20:30:44+05:30

    ఢిల్లీకి బయల్దేరిన కవిత..!

    • శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరిన కవిత

    • ఎయిర్‌పోర్టు నుంచి ప్లైట్‌ దగ్గరికి తీసుకెళ్లిన ఈడీ అధికారులు

    • సరిగ్గా 08:45 గంటలకు కదలనున్న ఫ్లైట్

    • రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు కవిత?

    • నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లనున్న అధికారులు

    • ఇవాళ రాత్రికి ఈడీ ఆఫీసులోనే ఉండనున్న కవిత

    Kavitha-Inside.jpg

  • 2024-03-15T20:25:33+05:30

    కవిత అరెస్ట్ అప్రజాస్వామికం!

    • కవిత అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

    • కవిత అరెస్ట్ అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం

    • అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం

    • రాజకీయ దురుద్దేశంతో కుట్రతో బీజేపీ మా ఎమ్మెల్సీని అరెస్ట్ చేసింది

    • బీజేపీ నేతలు ఏడాదిన్నర కాలంగా అరెస్ట్ చేస్తామని ప్రకటనలు చేశారు

    • రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తోంది.. ఈ రోజు కవితని అరెస్ట్ చేయడమేంటి..?

    • కేసిఆర్ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇలా చేస్తు్న్నారు

    • అరెస్టులు మాకు, మా పార్టీకి కొత్తేం కాదు

    • అరెస్ట్‌ను రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం

    • అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం

    • సుప్రీంకోర్టుకు చెప్పిన దానికి విరుద్ధంగా అరెస్ట్ చేశారు

    • 19న కోర్టులో విచారణ ఉంది.. అరెస్ట్‌కు ఇవ్వాళ తొందరెందుకు..?

    • పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయడానికి ఈ అరెస్ట్..?

    • కవిత అరెస్ట్‌కు నిరసనగా రేపు అన్ని నియోజక వర్గాల్లో నిరసనలు

    • ముందు సెర్చ్ అన్నారు.. తర్వాత అరెస్ట్ అన్నారు..

    • ముందే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసి ప్లాన్ ప్రకారం వచ్చారు

    • అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం : హరీష్ రావు

    Harish-Rao.jpg

  • 2024-03-15T20:20:07+05:30

    కవిత అరెస్ట్‌పై అర్వింద్ కామెంట్స్

    • కవిత అరెస్టుకు.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు

    • చెల్లెలు లిక్కర్ స్కామ్ చేయకుండా కేటీఆర్ చూసుకునేది ఉండే!

    • బీజేపీని బదనామ్ చేయడం మానుకోండి : ఎంపీ అర్వింద్

    Arvind-Dharmapuri.jpg

  • 2024-03-15T20:18:13+05:30

    శంషాబాద్ నుంచి నేరుగా..?

    • శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కవిత

    • సీఆర్పీఎఫ్ బలగాల మధ్య కవితను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లిన ఈడీ బృందం

    • రాత్రి 8:45 గంటలకు కవితను ఫ్లైట్‌లో తరలించనున్న ఈడీ

    • శంషాబాద్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న కవిత..

    • ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి కవితను నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించనున్న అధికారులు

    • ఇవాళ రాత్రికి ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనే ఉండనున్న కవిత

  • 2024-03-15T20:10:22+05:30

    ఎటు చూసినా హైఅలర్ట్..!

    • శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత

    • ఎయిర్‌పోర్టులో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది

    • భారీగా పోలీసుల మోహరింపు

    • రాత్రి 8: 45 గంటలకు ఫ్లైట్‌లో కవితను ఢిల్లీకి తరలించనున్న ఈడీ

    • 9 గంటల 30 నిమిషాల తర్వాత ప్రధాని మోదీ..

    • రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ వెళ్ళనున్న నేపథ్యంలో హైఅలర్ట్

    • కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పోలీసులు, ఎయిర్‌పోర్టు అధికారులు

    Kavitha-Modi-Murmu.jpg

  • 2024-03-15T20:00:24+05:30

    మీడియాకు నో ఎంట్రీ..?

    • శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కవిత తరలింపు

    • మీడియా నో ఎంట్రీ అని చెప్పి వాహనాలను నిలిపేసిన ఈడీ

    • కవిత కారును ఫాలో కాకుండా వాహనాలు నిలిపివేత

  • 2024-03-15T19:45:19+05:30

    ఫ్లైట్ ఎన్నింటికి..?

    • కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు

    • రాత్రి 8:55 గంటలకు ఫ్లైట్‌ బుక్‌ చేసిన ఈడీ

    • కవితను తీసుకెళ్లే రూట్‌ క్లియర్‌ చేసిన పోలీసులు

    • బీర్ఎస్‌ కార్యకర్తల హెచ్చరికతో పోలీసుల భారీ బందోబస్తు

  • 2024-03-15T19:45:05+05:30

    ఈడీ అధికారిక ప్రకటన

    • కవిత అరెస్ట్‌పై అధికారిక ప్రకటన చేసిన ఈడీ

    • ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితను అరెస్ట్‌ చేశాం

    • మనీలాండరింగ్‌ హవాలా చట్టం కింద అరెస్ట్ చేశాం

    • శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు కవితను అరెస్ట్‌ చేశాం

    • అరెస్ట్‌పై కవిత భర్త అనిల్‌కు సమాచారమిచ్చాం

    • 14 పేజీల అరెస్ట్‌ సమాచారాన్ని కవిత భర్తకు ఇచ్చాం: ఈడీ

    Enforcement-Directorate.jpg

  • 2024-03-15T19:15:40+05:30

    ఢిల్లీకి కవిత తరలింపు..

    • అరెస్టు తర్వాత ఎమ్మెల్సీ కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడి బృందం

    • ఇన్నోవా వాహనంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలింపు

    • ఇంటి నుంచి బయల్దేరిన ఈడీ వాహనాలు

  • 2024-03-15T19:15:11+05:30

    అరెస్ట్ తర్వాత ఫస్ట్ రియాక్షన్

    • ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటాం

    • బీఆర్ఎస్ శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి

    • అరెస్ట్ తర్వాత కారులో వెళ్తూ పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత

    • ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పార్టీ శ్రేణులను సముదాయించిన సీనియర్ నాయకులు

    • ఇలాంటి అణిచివేతను, దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను..

    • చట్టం పైన నమ్మకం ఉంచి ఎదుర్కొంటామని పార్టీ శ్రేణులకు తెలిపిన కవిత, బీఆర్ఎస్ నాయకత్వం

    Kavitha-Arrest-After.jpg

  • 2024-03-15T19:00:33+05:30

    కవితను అరెస్ట్ చేసింది ఈ చట్టం కిందే..!

    • PML యాక్ట్ కింద అరెస్ట్ ప్రకటించిన ఈడీ

    • శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ఈడీ ప్రకటన

    • అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన

    • మరోవైపు.. కవిత నివాసానికి చేరుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్

    Kavitha-Arrest-Order.jpg

  • 2024-03-15T18:47:15+05:30

    కవితను అరెస్ట్ చేసింది ఈ లేడీ బాసే!

    • కవిత ఇంట్లో ఈడీ జేడీ భాను ప్రియ మీనా ఆద్వర్యంలో ముగిసిన సోదాలు

    • కవితను ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి

    • కవిత ఇంటి వద్ద రోప్ పార్టీ ఏర్పాటు చేసిన పోలీసులు

    • భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు

    • ఈడీ జేడీ భాను ప్రియ మీనాతో వాగ్వాదానికి దిగిన కేటీఆర్

    • కేటీఆర్‌కు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన భాను ప్రియ మీనా

    • శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తరలించేందుకు వాహనాలు సిద్ధం

  • 2024-03-15T18:45:31+05:30

    KTR-At-Kavitha-Home.jpg

    కవిత ఇంట్లో కేటీఆర్ రచ్చ.. రచ్చ..!

    • కవిత అరెస్ట్‌పై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఫైర్

    • ఈడీ అనుమతితో కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్, హరీష్

    • ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను ప్రశ్నించిన కేటీఆర్

    • అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాటిచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారు..? కేటీఆర్

    • సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ వార్నింగ్

    • కావాలనే ఈడీ అధికారులు శుక్రవారం రోజున వచ్చారన్న కేటీఆర్

    • సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేస్తున్న ఐడీ అధికారులపై మండిపడ్డ కేటీఆర్

    • ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే... అరెస్టు అని చెప్పడం పైన తీవ్ర అభ్యంతరం

  • 2024-03-15T18:45:28+05:30

    భారీగా మోహరింపు!

    • కవిత ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు

    • కవిత తరలింపునకు ఆటంకాలు లేకుండా రోప్ పార్టీ ఏర్పాట్లు

  • 2024-03-15T18:30:04+05:30

    దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఏకకాలంలో ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే.. అరెస్ట్ అనంతరం కవితను ఢిల్లీకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి 8:45 గంటలకు కవిత కోసం ఫ్లైట్ టికెట్‌ను ఈడీ బుక్ చేసింది. ఈ వార్తతో ఒక్కసారిగా తెలంగాణలో పొలిటికల్ సీన్ మారిపోయింది. ఇటు బీఆర్ఎస్‌లో.. అటు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

  • 2024-03-15T18:15:56+05:30

    ఉదయం నుంచి ఇలా..!

    వాస్తవానికి కవితను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని మధ్యాహ్నం నుంచే టాక్ నడుస్తూ వచ్చింది. కవిత ఇంట్లో అధికారుల సోదాలు.. ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించడంతోనే ఇవాళ కీలక పరిణామమే జరుగుతుందని అందరూ ఊహించారు. దీనికి తోడు కవిత, ఆమె భర్త అనిల్.. సహాయకుల ఫోన్లు మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే.. తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మార్చి-19న విచారణ ఉండటంతో.. అంతవరకూ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవని బీఆర్ఎస్ వర్గాలు ధీమాతోనే ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి ఏక కాలంలో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు కాదు గతంలో ఢిల్లీ వేదికగా ఈడీ విచారణ జరిగినప్పుడే అరెస్ట్ చేయాల్సింది,.. ఆలస్యమైందంటూ కాంగ్రెస్ నేతలు సెటైర్లేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు మాత్రం కచ్చితంగా అరెస్ట్ ఉంటుందన్నట్లుగా చెబుతూ వస్తున్నారు.

  • 2024-03-15T18:00:55+05:30

    కవిత అరెస్ట్..

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో.. కవిత ఇంట్లో సుమారు 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్ట్ చేశారు.