Share News

AP Elections 2024: పవన్ ‘పిఠాపురం’ప్రకటనపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్.. ఇది చూశారో..?

ABN , Publish Date - Mar 14 , 2024 | 06:30 PM

Pawan Vs RGV: పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తున్నట్లు సేనాని స్వయంగా చెప్పడంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ సీన్ మారిపోయింది..

AP Elections 2024: పవన్ ‘పిఠాపురం’ప్రకటనపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్.. ఇది చూశారో..?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయం (AP Politics) హీటెక్కింది. అభ్యర్థుల ప్రకటనతో ఇటు టీడీపీ, జనసేన (TDP-Janasena) .. అటు వైసీపీ (YSRCP) బిజిబిజీగా ఉన్నాయి. ఎవరి గెలుపు లెక్కల్లో వాళ్లున్నారు. రెండోసారీ అధికారం తమదేనని వైసీపీ.. అబ్బే ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వమని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వ్యూహ రచన చేస్తోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే తాను ఎక్కడ్నుంచి పోటీచేస్తున్నా అనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తున్నట్లు సేనాని స్వయంగా చెప్పడంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ సీన్ మారిపోయింది. పిఠాపురం టీడీపీ స్థానం కావడంతో ఇటు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ తనకే టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఒకింత ఆగ్రహానికి లోనై.. టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు తగులబెట్టి.. రచ్చ రచ్చ చేశారు. టీడీపీ పెద్దలు రంగంలోకి దిగడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.


PAWAN-KALYAN.jpg

పానకంలో పుడకలాగా..!

ఇటు ఈ వర్మ సంగతి అటు క్లియర్ అవుతుండగానే.. అటు మరో వర్మ సీన్‌లోకి ఎంటరయ్యారు. అదేదో అంటారే.. సినిమా సీరియస్‌గా నడుస్తుండగా కమెడియన్ ఎంటరయినట్లుగా.. పానకంలో పుడకలాగా వచ్చారన్నట్లుగా.. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ, Ram Gopal Varma) సీన్‌లోకి వచ్చేశారు. ఇంకేముంది నవ్వులే.. నవ్వులు.. నెట్టింట్లో కామెంట్లే కామెంట్లు!. ఇంతకీ ఆయన ఏమని ట్వీట్ చేశారో తెలిస్తే అస్సలు నవ్వు ఆగదంతే. ‘ అవును.. నేను సడన్‌గా నిర్ణయం తీసుకుంటున్నాను. నేను పిఠాపురం నుంచి పోటీచేస్తున్నా. ఈ విషయాన్ని తెలియజేయడానికి సంతోషంగా ఉంది’ అని ట్వీట్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వర్మను ఆటాడేసుకుంటున్నారు. బాబోయ్.. కొందరి కామెంట్స్ చూస్తే వామ్మో మాటల్లో చెప్పలేం అంతే. ఈ ట్వీట్‌పై పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని అటు టీడీపీ.. ఇటు జనసేన వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Ram-Gopal-Varma.jpg

నిజమేనా.. కామెడీకేనా..?

వాస్తవానికి.. పవన్ కల్యాణ్‌పై ఎప్పుడూ ఇలా సెటైరికల్‌గా ట్వీట్ చేస్తుంటారు ఆర్జీవీ. అయితే ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా ఇలా చేస్తున్నారా.. లేకుంటే నిజంగానే పోటీచేయాలని ఆయన మనసులో ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. ఆర్జీవీ చెప్పారంటే కచ్చితంగా పంథానికి వెళ్లి మరీ పోటీచేయొచ్చనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఏదేమైనప్పటికీ సీరియస్‌గా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్న పరిస్థితుల్లో ఆర్జీవీ తన మార్క్‌ కామెడీ ఇలా పండిస్తున్నారన్న మాట. అయితే వర్మ చేసిన ఈ ట్వీట్‌ను ఆసక్తికర ట్వీట్ అనాలో.. లేకుంటే కామెడీ ట్వీట్ అనాలో ఆయనకే తెలియాలి మరి. ఫైనల్‌గా పోటీకి రెడీ అయిపోతారో లేకుంటే.. ట్వీట్‌కే పరిమితం అవుతారో తెలియాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి.. నామినేషన్ల వరకూ వేచి చూడాల్సిందే మరి.

Updated Date - Mar 14 , 2024 | 06:39 PM