Share News

Project Fight Live Updates: కాంగ్రెస్ వాళ్లకు కండ కావరమా.. కళ్లు నెత్తికెక్కాయా..?

ABN , First Publish Date - Feb 13 , 2024 | 10:38 AM

తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress, BRS) మధ్య ప్రాజెక్ట్స్ ఫైట్ (Project Fight) రోజురోజుకీ హీటెక్కుతోంది. ఇరు పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తు్న్నాయి. ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్, దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తోంది. ‘చలో మేడిగడ్డ’ (Chalo Medigadda) అంటూ కాంగ్రెస్.. ‘చలో నల్గొండ’ (Chalo Nalgonda) అంటూ బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..

Project Fight Live Updates: కాంగ్రెస్ వాళ్లకు కండ కావరమా.. కళ్లు నెత్తికెక్కాయా..?

Live News & Update

  • 2024-02-13T17:45:31+05:30

    కేసీఆర్‌నే చంపుతారా..?

    • కరెంట్‌ సమస్యను తీర్చకపోతే వదలం.. వేటాడుతాం

    • ఏం చేస్తారు?.. కేసీఆర్‌ను చంపేస్తారా?

    • కేసీఆర్‌ను చంపి బతుకుతారా?.. దమ్ముంటే రండి

    • ఏం చేద్దామని మేడిగడ్డకు కాంగ్రెస్‌ నేతలు వెళ్లారు?

    • కేసీఆర్‌ మీద బురద చల్లడానికి వెళ్తున్నారా?

    • దమ్ముంటే నీళ్లు వదలండి..

    • వందలాది పిల్లర్లతో ఒకటిరెండు దెబ్బతింటే రిపేర్‌ చేయించాలి

    • బాగు చెయ్యకుండా రాజకీయం చేస్తే కరెక్టేనా?

    • మేం డబుల్‌ స్పీడ్‌తో మళ్లీ అధికారంలోకి వస్తాం: కేసీఆర్‌

    • కృష్ణా జలాల్లో వాటా తేలేవరకూ తగ్గేదే లేదు

    • సమస్యలు తీరేదాకా ఊరుకోం, వెంటాడుతాం

    • అసెంబ్లీ సమావేశాలనే జనరేటర్‌తో నడిపించారు

    • మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఈ ప్రభుత్వం కరెంట్‌ ఇస్తదా?

    • ప్రజలకు ఏం భయం లేదు.. తెలంగాణను నాశనం కానివ్వను

    • ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వకుండా వెంటపడతాం

    • అబద్ధాలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది: కేసీఆర్‌

    KCR-Takkuvem.jpg

  • 2024-02-13T17:45:06+05:30

    ఎన్ని గుండెల్రా మీకు.. కాంగ్రెస్ నేతలపై కన్నెర్ర!

    • కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

    • రైతు బంధు ఇవ్వడానికి చేతకావట్లేదు

    • ఇస్తే ఇచ్చినవ్.. లేకపోతే లేదు

    • రైతుబంధు అడిగినందుకు రైతులను పట్టుకుని..

    • వాళ్లను చెప్పుతో కొట్టమని అంటావా..?

    • ఎన్ని గుండెల్రా మీకు..?

    • కండ కావరమా.. కళ్లు నెత్తికెక్కినాయా..?

    • చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయ్..!

    • ఇంకా బందోబస్తుగా కూడా ఉంటాయ్

    • ఒక్క చెప్పు దెబ్బతో పండ్లు ఊడిపోతాయ్ : కేసీఆర్

  • 2024-02-13T17:40:38+05:30

    నేనేం తక్కువ చేయలే!

    • కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య

    • నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు

    • గతంలో ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయి

    • మా బతుకు ఇది అని చెప్పినా గతంలో ఏ పార్టీ పట్టించుకోలేదు..

    • బీఆర్‌ఎస్‌ వచ్చాక నల్గొండను ఫ్లోరైడ్‌ రహితంగా చేశాం

    • భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్‌ బాధలు పోయాయి..

    • పదేళ్లలో నేనేం తక్కువ చేయలేదు

    • ఎక్కడినుంచో కరెంట్‌ తెప్పించి విద్యుత్‌ కోతలు లేకుండా చేశాం

    • నా గడ్డ, నా ప్రజలు, నా ప్రాంతం అనుకుంటే ఏమైనా సాధించొచ్చు

    • గోదావరి, కృష్ణా కలిపి మంచిగా నీళ్లు తెచ్చుకున్నాం

    • బస్వాపూర్‌ పూర్తైంది.. దిండి ప్రాజెక్ట్‌ పూర్తి కాబోతోంది..

    • పాలమూరు ఎత్తిపోతల పూర్తైతే పాలమూరు, వికారాబాద్‌, రంగారెడ్డి ప్రజలకు మేలు: కేసీఆర్‌

    KCR-Takkuvem.jpg

  • 2024-02-13T17:30:19+05:30

    కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ తీవ్ర విమర్శలు

    • బస్వాపూర్‌ ప్రాజెక్టు పూర్తయ్యింది, డిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది

    • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి

    • ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాలు కేటాయించారు

    • ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రైబ్యునల్‌ ముందు పోరాడాలి

    • పదవులు శాశ్వతం కాదు.. ప్రజల హక్కులు శాశ్వతం

    • అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షానే ఉంటాం

    • బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత రైతులకు సమృద్ధిగా కరెంట్‌ వచ్చింది

    • కేసీఆర్‌ పదవి నుంచి తప్పుకోగానే ఎందుకు కరెంట్‌ కట్‌ అవుతుంది

    • దద్దమ్మల పాలనలో ఇలాగే ఉంటుంది

    • పాలిచ్చే బర్రెను అమ్మేసి.. దున్నపోతును తెచ్చుకున్నారు: కేసీఆర్‌

  • 2024-02-13T17:25:44+05:30

    ఉద్యమ సభ.. పోరాట సభ!

    • ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ సభ, పోరాట సభ

    • కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది

    • నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదు

    • ఫ్లోరైడ్‌ వల్ల నల్లగొండ ప్రజల నడుములు వంగి పోయాయి

    • ఫ్లోరైడ్‌ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధానికి చూపించాం

    • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నల్లగొండలో ఫ్లోరైడ్‌ సమస్య పోయింది

    • 24 ఏళ్లుగా పక్షిలాగ తిరుగుతూ రాష్ట్రం మొత్తం చెప్పాను

    • ఇది చిల్లమల్లర రాజకీయ సభ కాదు

    • ఓట్లు వచ్చినప్పుడే కొందరు ప్రజల వద్దకు వస్తారు

    • పోరాటం చేసి.. రాష్ట్రం తెచ్చి.. పదేళ్లు పాలించాను

    • నా పాలనలో ఎవరికీ అన్యాయం చేయలేదు

    • నా ప్రాంతం.. నా గడ్డ అనే ఆరాటం ఉంటే..

    • ఎక్కడివరకైనా పోరాడవచ్చు

    • పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపాయే అనే పాట రాశాను

    • బస్వాపూర్‌ ప్రాజెక్టు పూర్తయ్యింది, డిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

    KCR-Speech-2.jpg

  • 2024-02-13T17:15:02+05:30

    కాలు విరిగినా కొట్లాటకు వచ్చా!

    • కూర్చునే మాట్లాడతానని చెప్పిన కేసీఆర్‌

    • జై తెలంగాణ అంటూ నినదించిన గులాబీ బాస్

    • కాలు విరిగినా కట్టె పట్టుకుని నల్లగొండకు వచ్చానన్న కేసీఆర్‌

    • కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ పేరిట నల్గొండలో భారీ సభ

    KCR-Speech-Sitting.jpg

  • 2024-02-13T17:00:53+05:30

    అధికారం కోల్పోయాక తొలి సభ!

    • నల్లగొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

    • సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్‌

    • ప్రత్యేక చాపర్‌లో నల్గొండకు గులాబీ బాస్

    • కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ పేరిట భారీ సభ

    • సభకు హాజరైన కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర ఎమ్మెల్యేలు

    • అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

    KCR-Nalgonda-Sabha.jpg

  • 2024-02-13T16:15:41+05:30

    కేటీఆర్ బస్సుపై కోడి గుడ్లతో దాడి

    • నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్తున్న బీఆర్ఎస్ బృందం

    • కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సుపై కోడిగుడ్లతో దాడిచేసిన NSUI కార్యకర్తలు

    • నల్లదుస్తులు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు

    • వీటీ కాలని వద్ద ఘటన.. తీవ్ర ఉద్రిక్తత

    • బస్సులోనే ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు

  • 2024-02-13T16:09:28+05:30

    సారు.. కదిలారు!

    • నల్లగొండ బీఆర్‌ఎస్‌ సభకు బయల్దేరిన కేసీఆర్‌

    • హైదరాబాద్‌ నుంచి నల్లగొండకు బయల్దేరిన గులాబీ బాస్

    • ఇప్పటికే నల్గొండకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

    • నల్గొండ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి

      KCR-Nalgonda.jpg

  • 2024-02-13T16:00:16+05:30

    మేడిగడ్డకు రేవంత్ టీమ్!

    • మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌ బృందం

    • మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్న అధికారులు

    Revanth-At-Medigadda.jpg

  • 2024-02-13T16:00:14+05:30

    బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్!

    • కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రాడో ఆయనకే తెలియాలి

    • గతంలో సచివాలయానికి వెళ్లేవారు కాదు..

    • ఇప్పుడు అసెంబ్లీకి రారు

    • కేవలం సభలకు మాత్రమే కేసీఆర్‌ వెళ్తున్నారు

    • మేడిగడ్డ పేరుతో కాంగ్రెస్‌ నాటకాలు ఆడుతోంది : కిషన్‌ రెడ్డి

    kishan reddy.jpg

  • 2024-02-13T15:39:33+05:30

    • మేడిగడ్డకు చేరుకున్న సీఎం బృందం

    • మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న అధికారులు

    • కుంగిన పిల్లర్లను పరిశీలిస్తన్న బృందం

  • 2024-02-13T15:25:17+05:30

    మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముంది?: బండి సంజయ్

    Untitled-5.jpg

    మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు సీఎం రేవంత్ (CM Revanth Reddy) సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరి వెళ్లడంపై బీజేపీ ఎంపీ బండిసంజయ్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మంత్రులు, ఇంజనీర్లు ఎప్పుడో కాళేశ్వరం వెళ్లి నివేదిక ఇచ్చారు కదా అని ప్రస్తావించారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని బండి సంజయ్ నిలదీశారు. కృష్ణా నీటి పేరుతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని విమర్శించారు. ముక్కు నేలకు రాసి బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలను గాలికొదిలేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ కోరాలన్నారు. అసెంబ్లీ విలువైన సమయాన్ని వృధా చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేశారన్నారు. ‘‘మేం కొట్లాడుతుంటే, నిధులిస్తుంటే కాంగ్రెస్‌కు ఓట్లేయడం న్యాయమా’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

  • 2024-02-13T15:15:16+05:30

    కూర్చోనే కేసీఆర్ ప్రసంగం!

    • నల్గొండ బహిరంగ సభలో సీటులో కూర్చోనే కేసీఆర్ ప్రసంగం

    • ఈ మధ్యనే తుంటి ఆపరేషన్ చేయించుకున్న గులాబీ బాస్

    • సభలో ఎక్కువసేపు నిల్చోవడంతో కాలుకు మళ్లీ ఇబ్బంది తలెత్తే ఛాన్స్!

    • వైద్యుల సూచన మేరకు కుర్చీలో కూర్చునే మాట్లాడిన కేసీఆర్

  • 2024-02-13T14:30:02+05:30

    ఇటు బీఆర్ఎస్.. అటు వైసీపీ.. సెంటిమెంట్స్!

    • ఇటు బీఆర్ఎస్, అటు వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపుతున్నాయి

    • కృష్ణా బోర్డు, రాజధాని కొనసాగింపు అంశాలతో ఎన్నికలకు వెళ్దామని వైసీపీ ఆలోచిస్తోంది

    • సెంటిమెంట్ వాడుకోవడం రాజకీయ దివాలాకోరుతనం

    • సెంటిమెంట్ రగల్చడం కోసం వైసీపీ నేత వైవీ సుబ్బా రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు

    • బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు వైసీపీ యాక్షన్ మొదలుపెట్టింది

    • మూడు రాజధానుల రాజకీయ ముఖ చిత్రం ఫెయిల్ అయ్యింది

    • ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు

    • సెంటిమెంట్‌ను బేస్ చేసుకోవడం అంటేనే చేతకాని తనం

    • కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాజధాని ఇస్తాం : అద్దంకి దయాకర్

    Addanki-Dayakar-On-BRS-YSRC.jpg

  • 2024-02-13T14:15:25+05:30

    కేసీఆర్ నీళ్లు.. రేవంత్ నిప్పులు!

    • మరో గంటన్నరలో మేడిగడ్డకు చేరుకోనున్న సీఎం రేవంత్ బృందం

    • మేడిగడ్డ ప్రాజెక్ట్, కుంగిన బ్యారేజీ ప్రాంతాన్ని పరిశీలించనున్న రేవంత్ టీమ్

    • నల్గొండలో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం

    • చలో నల్గొండ సభకు హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

    • కేసీఆర్ ప్రసంగంపై తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి

    • ప్రాజెక్టులపై పోటాపోటీ కార్యక్రమాలతో హీటెక్కిన తెలంగాణ రాజకీయం

    • కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీపీఎం, ఎంఐఎం ఎమ్మెల్యేలు

    • మేడిగడ్డ టూర్‌కు దూరంగా బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు

    Revanth-Vs-KCR.jpg

  • 2024-02-13T13:30:25+05:30

    దొందూ దొందే.. డ్రామాలు!

    • మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముంది..?

    • మంత్రులు, ఇంజనీర్లు కాళేశ్వరం ఎప్పుడో వెళ్లి నివేదిక ఇచ్చారు కదా..?

    • కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు..?

    • కృష్ణా నీటి పేరుతో బీఆర్ఎస్.. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయ్

    • ముక్కు నేలకు రాసి బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి

    • హామీలను గాలికొదిలేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ కోరాలి

    • అసెంబ్లీ విలువైన సమయాన్ని వృథా చేస్తారా?

    • ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేశారు

    • త్యాగాలు బీజేపీవి.. భోగాలు కాంగ్రెస్‌కా..?

    • గ్రామగ్రామానికి మోదీ ప్రభుత్వం కోట్లల్లో ఖర్చు చేసింది.. ఇదిగో వివరాలు!

    • మేం కొట్లాడుతుంటే, నిధులిస్తుంటే కాంగ్రెస్‌కు ఓట్లేయడం న్యాయమా? : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్

    Bandi-Sanjay-Kumar-2.jpg

  • 2024-02-13T13:25:01+05:30

    కాసేపట్లో మేడిగడ్డకు రేవంత్ బృందం

    • కాసేపట్లో మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి బృందం

    • వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు చేరుకున్న రేవంత్ రెడ్డి టీమ్

    • కాన్వాయ్ వచ్చే దారిలో భారీ బందోబస్తు

    • మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్

    • భద్రతా బలగాల ఆధీనంలో మేడిగడ్డ

    • మేడిగడ్డలో 20వ ఫిల్లర్ దగ్గర కుంగిన ప్రాంతాన్ని పరిశీలించనున్న రేవంత్ రెడ్డి బృందం

    Congress-MLAS-Medigadda.jpg

  • 2024-02-13T13:10:53+05:30

    మేడిగడ్డకు పర్యటనకు ముందు రేవంత్ ట్వీట్

    • తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది

    • రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి కనీసం.. 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి

    • ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్.. మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదు

    • మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు.. పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది

    • ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నమే ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన

    • కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం

    • బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదు

    • కాళేశ్వరం ప్రాజెక్టు చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని..

    • ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు.. వాస్తవాలు చూడటానికి క్షేత్రస్థాయికి ఎందుకు రావడం లేదు..?

    • అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయి

    • మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోంది : సీఎం రేవంత్ రెడ్డి

    Revanth-Intresting-Tweet.jpg

  • 2024-02-13T12:52:39+05:30

    ఘన స్వాగతం!

    • ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

    • జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళాతోరణం దాటి..

    • జిల్లాలోకి ప్రవేశించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల, ఎమ్మెల్యేలు

    • స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు

  • 2024-02-13T12:27:54+05:30

    నల్లొండకు పయనమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం!

    తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ప్రాజెక్ట్ ఫైట్ తారా స్థాయికి చేరుకుంది. ఓ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మేడిగడ్డ సందర్శనకు బయలుదేరగా.. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం నల్గొండకు పనయమైంది. తెలంగాణ నదీ జలాలపైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ (BRS) నేడు (మంగళవారం) నల్లగొండలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం కాసేపటి క్రితమే నల్గొండకు బయలుదేరి వెళ్లింది. తెలంగాణ భవన్ నుంచి ‘’చలో నల్గొండ’’ బహిరంగ సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు బయలుదేరారు. ఈ సభావేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు..? కాంగ్రెస్ విమర్శలకు ఎలా కౌంటర్లు ఇవ్వబోతున్నారు..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    Sabha-BRS.jpg

    ఇది మొదటి అడుగు మాత్రమే!

    ఈ సంద్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని గత పది సంవత్సరాలుగా అడ్డుకున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ గళమెత్తిందన్నారు. నదీజలాల పరిరక్షణ కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు నల్గొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.

    BRS-Nalgonda-Sabha.jpg

    ఒప్పుకునే ప్రసక్తే లేదు!

    బీఆర్ఎస్ బహిరంగ సభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచిందని తెలిపారు. నిన్న అసెంబ్లీలో అబద్దాలను ప్రచారం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం తమపైన ఉన్నదన్నారు. ఈరోజు బీఆర్‌ఎస్ అధ్యక్షులు తెలంగాణ ప్రజలకు నదీ జలాలపైన, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాలపైన సభలో వివరిస్తారన్నారు. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోమన్నారు. ఈరోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమే అని.. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

    kadiyam-srihari.jpg

  • 2024-02-13T12:10:29+05:30

    భారీ బందోబస్తు.. కాసేపట్లో మేడిగడ్డకు ముఖ్యమంత్రి బృందం

    • మరికాసేపట్లో మేడిగడ్డకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం

    • సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లు

    • హైదరాబాద్ నుంచి మేడిగడ్డ వరకు రోడ్డు మార్గాన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు

    • ప్రతీ కిలో మీటర్‌కు ప్రత్యేక పోలీస్ పోస్ట్

    • భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు

    • ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీస్ నిఘా

    Revanth-In-Bus.jpg

  • 2024-02-13T12:08:35+05:30

    ఎందుకీ నాటకాలు..?

    • అధికారంలో ఉండి ఏం చేస్తామో కాంగ్రెస్ పార్టీ చెప్పలేక పోతోంది

    • మీడియా పాయింట్‌లో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

    • ఎన్నికల కోసమే కాంగ్రెస్, BRS కొత్త నాటకాలకు తెరలేపాయి

    • కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిన విషయం తెలుసుకొని..

    • గత ఏడాది అక్టోబర్ 22న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు

    • నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశాం.. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అప్పటి ప్రభుత్వం కనీసం సమాధానాలు చెప్పలేదు

    • కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసి రావడం వల్ల ఒరిగేది ఏమీ లేదు

    • కాళేశ్వరం అవినీతిపై CBI దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం

    • మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిక్నిక్‌గా వెళ్తున్నారు

    • కాళేశ్వరం ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని అందరికీ తెలుసు.. ఇప్పుడు వెళ్లి ఏం చేస్తారు..?

    • మార్పు అనేది గ్రౌండ్‌లో ఏమి లేదు

    • అప్పుడు BRS అధికార దుర్వినియోగం చేశారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది

    • అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రివిలేజ్ లేదు.. ప్రోటోకాల్ లేదు

    • ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

    • కాళేశ్వరం ప్రాజెక్ట్ టూర్‌ను బహిష్కరిస్తున్నాం

    • రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దర్యాప్తును CBI కి అప్పగించాలి: పాల్వాయి హరీష్

    payal-shankar.jpg

  • 2024-02-13T12:00:00+05:30

    హరీష్ ఒప్పుకున్నట్లే!

    • ఒకటే బ్యారేజ్ కదా పొంగిందని మాజీ సాగు నీటి మంత్రి హరీష్ రావు తప్పును ఒప్పుకుంటున్నారు

    • కాళేశ్వరం దేవుడి పేరు మీద భారీ అవినీతి చేశారు

    • సభకు ప్రతిపక్ష నాయకుడు రావడం లేదు

    • కేసీఆర్ లీడర్‌గా రీ లాంచ్ చేసుకోవడానికే కేసీఆర్ నల్లగొండ సభ పెట్టుకుంటున్నారు: యెన్నం శ్రీనివాసరెడ్డి

    Yennam-Sreenivas-Reddy.jpg

  • 2024-02-13T11:37:50+05:30

    కాంగ్రెస్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

    • కాంగ్రెస్ విమర్శలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్

    • శాసన సభ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నా

    • మీరు మాట్లాడి, మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం

    • ప్రజాస్వామ్య విలువలు మంట గలిపే విధంగా ఉంది ప్రభుత్వం తీరు

    • కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదు

    • కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు..

    • 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్..

    • 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం.. వీటన్నింటి సమాహారం కాళేశ్వరం

    • ఒక బ్యారేజీలో ఒకటి రెండు కుంగిపోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు

    • మీరు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడండి

    • కాళేశ్వరం ఫలితాలు రైతును అడగండి

    • కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి రంగనాయక సాగర్ చూశారు

    • అద్బుతం అని మెచ్చుకున్నారు.. నేర్చుకున్నారు

    • చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు

    • కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదు

    • మేము నీళ్ళు లేని నుండి నీళ్ళు ఉన్న దగ్గరకు మార్చి ప్రాజెక్టు కట్టి నీళ్ళు అందించాం

    • మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే..

    • తప్పు జరిగితే చర్య తీసుకోండి.. పునరుద్దరణ పనులు చేయండి

    • దురుద్దేశంతో ప్రాజెక్ట్ పునరుద్దరణ చేయడం లేదు

    • అద్భుతంగా నిర్మించి నీళ్లు ఇస్తున్నాం

    • రైతులకు ఇబ్బంది పెట్టకండి.. నష్ట పోతారు. ప్రజలు క్షమించరు

    • కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలి 20 మంది చనిపోయారు

    • దేవాదుల పైపులు పేలి నీళ్ళు ఆకాశమంత ఎగిరాయి

    • అలాంటి ఘటనలు జరగటం బాధాకరం.. కానీ ముందుకు వెళ్ళాం కదా..?

    • ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని మేము నిద్ర లేపితే లేచారు

    • ఈరోజు మా సభ ఉందని మీరు డైవర్ట్ కోసం పోటీ కార్యక్రమం పెట్టారు

    • మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారు : హరీష్ రావు

    Harish-Rao.jpg

  • 2024-02-13T11:25:05+05:30

    మేడిగడ్డ పర్యటనకు భట్టి విక్రమార్క దూరం

    • మేడిగడ్డ టూర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • భట్టి విక్రమార్క సోదరుడు వెంకటేశ్వర్లు(73) మృతి

    • కొన్నిరోజులుగా ఏఐడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు

    • మృతదేహాన్ని వైరాకు తరలించిన బంధువులు, కుటుంబసభ్యులు

    • సోదరుడి మృతితో మేడిగడ్డ పర్యటనకు దూరంగా ఉన్న భట్టి విక్రమార్క

    • సోదరుడి అంత్యక్రియలకు హాజరుకానున్న భట్టి

    Bhatti.jpg

  • 2024-02-13T11:22:24+05:30

    రోడ్డు మార్గాన సీఎం రేవంత్!

    • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రోడ్డు మార్గాన మేడిగడ్డకు బయల్దేరిన సీఎం రేవంత్

    • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై..

    • పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్న సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

    • తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు అని పదే పదే చెబుతున్న కాంగ్రెస్

    • కేసీఆర్ కుటుంబం డబ్బులు సంపాదించుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు అని కాంగ్రెస్ ఆరోపణలు

    Medigadda-Revanth.jpg

  • 2024-02-13T11:00:19+05:30

    మేడిగడ్డకు పయనం!

    • శాసనసభ సమావేశాల అనంతరం మేడిగడ్డకు బయల్దేరిన కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు

    • అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు

    • మేడిగడ్డ విజిట్‌కి దూరంగా బీఆర్ఎస్, బీజేపీ

    Congress-MLAS.jpg

  • 2024-02-13T10:57:37+05:30

    శాసనసభ వాయిదా

    • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా

    • మంగళవారం నాడు సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా

    • ‘మిషన్ మేడిగడ్డ’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్

    • ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిని తవ్వితీస్తున్న రేవంత్ ప్రభుత్వం

    Speaker.jpg

  • 2024-02-13T10:50:58+05:30

    సారొస్తారా.. స్పెషల్ ఫ్లైట్ రెడీ!

    • మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు కేసీఆర్ వస్తారా..?

    • కేసీఆర్ వస్తానంటే ప్రత్యేక హెలికాప్టర్ సిద్దం చేయడానికి మేం రెడీగా ఉన్నాం

    • కాలేశ్వరరావుని కూడా కాళేశ్వరం రమంటున్నాం

    • బస్సుల్లో అంత దూరం రావడానికి బీఆర్ఎస్ నాయకులు..

    • ఇబ్బంది పడితే వారికోసం హెలికాప్టర్‌లో వెళ్దాం

    • అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి

    Revanth-Reddy-Assembly.jpg

  • 2024-02-13T10:45:32+05:30

    అవును భారీ నష్టమే..!

    • కాళేశ్వరంపై అన్ని రకాలుగా పూర్తి స్థాయి సమీక్ష జరిగింది

    • ఇప్పటికే మంత్రుల బృందం మేడిగడ్డను పరిశీలించింది

    • భారీ నష్టం జరిగిందనే అంచనాతోనే విజిలెన్స్ విచారణకి ఆదేశించాం

    • మేడిగడ్డకు మేము మాత్రమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులను ఆహ్వానించాం

    • మేడిగడ్డ నిర్మాణంలో తప్పిదాలు ఉన్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా పేర్కొంది

    • కాంగ్రెస్ హాయాంలో కట్టిన ప్రాజెక్టులు 40,50 ఏళ్ళు అవుతున్నా చెక్కు చెదరకుండా ఉన్నాయి

    • గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని విజిలెన్స్ రిపోర్టులో తేలింది: మంత్రి శ్రీధర్ బాబు

    Sridhar-Babu.jpg

  • 2024-02-13T10:15:06+05:30

    తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress, BRS) మధ్య ప్రాజెక్ట్స్ ఫైట్ (Project Fight) రోజురోజుకీ హీటెక్కుతోంది. ఇరు పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తు్న్నాయి. ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్, దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తోంది. ‘చలో మేడిగడ్డ’ (Chalo Medigadda) అంటూ కాంగ్రెస్.. ‘చలో నల్గొండ’ (Chalo Nalgonda) అంటూ బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు. వీరితో పాటు మజ్లిస్‌, సీపీఐ సభ్యులు అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటనకు బయల్దేరి వెళ్తారు. కాళేశ్వరం నిర్మాణ లోపాలు ఎత్తి చూపడానికి ఈ రోజు అఖిలపక్షం మేడిగడ్డ సందర్శనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్యేల వెంట కాళేశ్వరానికి (Kaleswaram) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా వెళ్లనున్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి (KRMB) అప్పగించేది లేదని సోమవారం నాడు అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) ప్రజాప్రతినిధులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధుల మేడిగడ్డ సందర్శన రెండు గంటల పాటు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

    kcr-revanth.jpg

    సర్వత్రా ఆసక్తి!

    మరోవైపు.. అసెంబ్లీ వాయిదా అనంతరం నల్గొండకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో (BRS Chief KCR) పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించవద్దని నల్గొండలో బీఆర్ఎస్ నిరసన సభ నిర్వహిస్తోంది. నల్గొండ సభతో నేటి నుంచి ప్రజల్లోకి కేసీఆర్ వెళ్లనున్నారు. సుదీర్ఘ విశ్రాంతి తర్వాత జనాల్లోకి కేసీఆర్ వెళ్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలి బహిరంగ సభ కావడంతో ప్రభుత్వంపై.. పదే పదే బాస్‌ను, పార్టీని టార్గెట్ చేస్తున్న సీఎం రేవంత్, మంత్రులపై కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు..? ఎలా మాట్లాడబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    nagarajuna sagar lo cm kcr sabha  (5) copy.JPG

    తగ్గేదేలే!

    కాగా.. మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ వెళుతుండగా.. బీఆర్‌ఎస్‌, బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లడం లేదు. మేడిగడ్డ పర్యటనకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లడం లేదంటూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అధికార, ప్రతిపక్షాలు మంగళవారమే నదీ జలాలకు సంబంధించి పోటీ కార్యక్రమాలు తలపెట్టడంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాలపై నల్లగొండలో కేసీఆర్‌ సభను తలపెడితే.. సీఎం రేవంత్‌ మేడిగడ్డ పర్యటన పెట్టడం టెన్షన్.. టెన్షన్‌గా.. అంతకుమించి చర్చనీయాంశమైంది.

    Congress-Ministers.jpg

    కూంబింగ్..

    మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్‌, ప్రజాప్రతినిధులు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్‌ నుంచి బస్సుల్లో వస్తున్నందున పోలీస్‌, ఇంటెలిజెన్స్‌ బృందాలు భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాలపల్లి నుంచి పంకెన, పలిమెల వరకు భారీగా బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్‌ బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.