చియా సీడ్స్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదా..!
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:31 PM
చియా సీడ్స్ వాటర్‍లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. అయితే చియా సీడ్స్ వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కదా.. ఆహార నిపుణులు చెప్పిన నిజాలు ఏంటంటే..
1/5
చియా సీడ్ వాటర్‍ను రోజూ తీసుకుంటే జీర్ణక్రియ పాడవుతుంది. దీంతో పాటూ అలెర్జీలు రావచ్చు. అలెర్జీ సమస్యలు ఉన్నవారు చియా సీడ్స్‍ను తీసుకోకపోవడమే మంచిది.
2/5
చియా సీడ్స్‍లో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది. శరీరం డీహైడ్రేషన్‍కు లోనవుతుంది.
3/5
చియా సీడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కడుపులో గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
4/5
ఈ వాటర్‍లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయట. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే శరీరంలో కేలరీల పరిమాణం కూడా పెరుగుతుందట.
5/5
చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
Updated at - Dec 22 , 2024 | 12:32 PM