చలికాలంలో వీరు పొరపాటున కూడా ఉసిరి కాయ తినకూడదు..

ABN, Publish Date - Dec 18 , 2024 | 06:48 AM

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఉసిరి అస్సలు తినకూడదు.

 చలికాలంలో వీరు పొరపాటున కూడా ఉసిరి కాయ తినకూడదు.. 1/6

ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, కె, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్ వంటి మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

 చలికాలంలో వీరు పొరపాటున కూడా ఉసిరి కాయ తినకూడదు.. 2/6

టైప్ 1, 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఉసిరి చాలా మేలు చేస్తుంది. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండటం మంచిది.

 చలికాలంలో వీరు పొరపాటున కూడా ఉసిరి కాయ తినకూడదు.. 3/6

గుండెల్లో మంట సమస్యలు ఉన్నవారు ఉసిరి తీసుకోకూడదు. శీతాకాలంలో చాలా మంది జలుబు, దగ్గు సమస్యలతో బాధపడతారు. వీరు ఉసిరి కాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

 చలికాలంలో వీరు పొరపాటున కూడా ఉసిరి కాయ తినకూడదు.. 4/6

కడుపు సమస్యలు, మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలి.

 చలికాలంలో వీరు పొరపాటున కూడా ఉసిరి కాయ తినకూడదు.. 5/6

ఉసిరికాయను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. పొడి చర్మం, స్కాల్ప్ డ్రైగా ఉన్నవారు ఉసిరికాయను ఎక్కువగా తినకూడదు.

 చలికాలంలో వీరు పొరపాటున కూడా ఉసిరి కాయ తినకూడదు.. 6/6

హైపర్‌ ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల కడుపులో చికాకు, ఆమ్లత్వం ఏర్పడుతుంది.

Updated at - Dec 18 , 2024 | 06:52 AM