Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం..
ABN, Publish Date - Sep 23 , 2024 | 11:44 AM
హైదరాబాద్: భాగ్యనగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. కుండపోతగా వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షం ధాటికి లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయారు.
1/6
హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయం అయిన రోడ్లు.. నిలిచిపోయిన వాహనాలు..
2/6
వర్షం నీటిలో నిలిచిపోయిన కారును ముందుకు తోస్తూ సహాయం చేస్తున్న దృశ్యం..
3/6
ఛత్రినాకలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్దుపై నిలిచిన వర్షం నీరు.. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..
4/6
ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో స్కూల్కు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
5/6
రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ఆటోలో స్కూల్కు వెళుతున్న విద్యార్థులు
6/6
వర్షపు నీటిలో సైకిల్ తొక్కుకుంటూ స్కూల్కు వెళుతున్న విద్యార్థిని..
Updated at - Sep 23 , 2024 | 11:44 AM