Yadadri: యాదాద్రికి పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - May 20 , 2024 | 10:45 AM
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామివారి ఆలయ ముఖ మండపం నందు వేద పండితులు లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. కాగా సోమవారం నుంచి లక్ష్మీనృసింహస్వామివారి జయంత్యుత్సవాలు ప్రారంభంకానున్నాయి.
1/6
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామివారి ఆలయ ముఖ మండపం నందు వేద పండితులు లక్ష పుష్పార్చన నిర్వహించిన దృశ్యం..
2/6
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్బంగా వేద పండితులు యజ్ఞం నిర్వహిస్తున్న దృశ్యం..
3/6
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.. క్యూలైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్న దృశ్యం..
4/6
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో కొండ కింది పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలిపిన దృశ్యం.
5/6
వారాంతపు సెలవు రోజు, వేసవి సెలవులు కావడంతో యాదాద్రి కొండపై నెలకొన్న భక్తుల రద్దీ.. కార్ల పార్కింగ్..
6/6
యాదగిరిగుట్ట ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో సాయంత్రం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి బై పాస్ రోడ్డు, బీబీనగర్ నగర్ టోల్ గేట్ వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు...
Updated at - May 20 , 2024 | 10:45 AM