తిరుమలయ్య గుట్టకు పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Aug 25 , 2024 | 11:33 AM
మహబూబ్‌నగర్ జిల్లా: వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గుట్టపై వెలసిన తిరుమలయ్య స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తిరుమలయ్య గుట్టపై స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు.
1/7
వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గుట్టపై వెలసిన తిరుమలయ్య స్వామికి హారతి ఇస్తున్న అర్చకుడు..
2/7
తిరుమలయ్య గుట్టపై స్వామిని దర్శించుకున్న భక్తులకు హారతి ఇస్తున్న అర్చకుడు..
3/7
తిరుమలయ్య గుట్టపై స్వామిని దర్శించుకుని యజ్ఞం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు..
4/7
వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గుట్టపై ఉన్న చెరువు వద్ద భక్తుల సందడి..
5/7
తిరుమలయ్య గుట్టపై స్వామిని దర్శించుకునేందుకు మెట్లద్వారా నడుచుకుంటూ వెళుతున్న భక్తులు..
6/7
తిరుమలయ్య గుట్టపై షాపుల వద్ద భక్తులు కొనుగోళ్లు చేస్తున్న దృశ్యం..
7/7
తిరుమలయ్య గుట్టపై స్వామిని దర్శించుకుని.. ఖాళీ ప్రదేశంలో సేదదీరుతున్న భక్తులు..
Updated at - Aug 25 , 2024 | 11:33 AM