మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి..

ABN, Publish Date - Jul 10 , 2024 | 12:54 PM

మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే సాగునీరు, విద్య, వైద్యం, పలు అంశాలపై చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరుగులు పెట్టనున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొత్తగా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టే అవకాశముంది.

మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. 1/6

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు విచ్చేసిన దృశ్యం..

మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. 2/6

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళా సమాఖ్య సంఘాలకు రూ. 334 కోట్ల 2 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తున్న దృశ్యం.

మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. 3/6

స్వయం ఉపాధి పొందిన మహిళలు తయారు చేసిన ఉత్సత్తులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి..

మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. 4/6

మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి పూలబొకేలిచ్చి స్వాగతం పలుకుతున్న స్థానిక కాంగ్రెస్ నేతలు..

మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. 5/6

సీఎం రేవంత్ రెడ్డికి మొక్కను అందజేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ అధికారిణి..

మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. 6/6

మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కను నాటి మట్టిపోస్తున్న దృశ్యం..

Updated at - Jul 10 , 2024 | 12:54 PM