గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ABN, Publish Date - Aug 15 , 2024 | 12:57 PM
హైదరాబాద్:78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ గోల్కండలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం. సుదీర్ఘ పోరాట ఫలితం. అనేక ప్రాణత్యాగాలు, అనేకానేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్య్రమని.. ఎందరో మహామహుల త్యాగాల వెల కట్టలేని బహుమతి ఈ స్వాతంత్య్రం అని అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నానని సీఎం అన్నారు.
1/7
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ గోల్కొండలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
2/7
గోల్కొండలో సైనిక వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
3/7
గోల్కొండలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
4/7
పోలీస్ అధికారికి మెడల్ బహూకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
5/7
సింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న దృశ్యం.
6/7
పేరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సెల్యూట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
7/7
సింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్‌లో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..
Updated at - Aug 15 , 2024 | 12:57 PM