ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రేటీలు..

ABN, Publish Date - May 13 , 2024 | 12:58 PM

హైదరాబాద్: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రేటీలు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రేటీలు.. 1/8

పద్మవిభూషన్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకుని మీడియాకు చూపుతున్న దృశ్యం.

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రేటీలు.. 2/8

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన సతీమణితో కలిసి జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకుని మీడియాకు చూపుతున్న దృశ్యం.

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రేటీలు.. 3/8

విలక్షణ నటుడు, నిర్మాత మోహన్ బాబు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రేటీలు.. 4/8

ఓబుల్ రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్.

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రేటీలు.. 5/8

హైదరాబాద్, జూబ్లీహిల్స్, బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన సినీ నటుడు స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రేటీలు.. 6/8

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలో సినీ నటుడు నరేష్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రేటీలు.. 7/8

సినీ నటుడు శ్రీకాంత్ హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రేటీలు.. 8/8

మా అధ్యక్షుడు, సినీ నటుడు, మోహన్ బాబు తనయుడు విష్ణు హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated at - May 13 , 2024 | 12:58 PM