తాడేపల్లిగూడెం.. టీడీపీ, జనసేన సభ సూపర్ సక్సెస్ ఫోటోస్..
ABN, Publish Date - Feb 29 , 2024 | 11:58 AM
పశ్చిమగోదావరి జిల్లా: పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం వేదికగా బుధవారం జరిగిన విజయకేతనం జెండా సభ.. గోదావరికి వరద వస్తే ఎలా ఉంటుందో.. దాన్ని తలపించింది. లక్షలాదిగా పోటెత్తిన జనంతో సభ సూపర్ సక్సెస్ అయింది. సభ వేదికపై అగ్రనేతలు ఇద్దరూ ఒకరి జెండా ఒకరు పట్టుకుని (చంద్రబాబు జనసేన జెండా.. పవన్ కల్యాన్ తెలుగుదేశం జెండా) తమ కూటమి అంత గట్టిగా ఉందన్న సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం ఈ కూటమిదేనన్న చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న ఈ మొదటి సభ రాష్ట్రం దశ, దిశ మార్చబోతోంది.
1/7
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాడేపల్లి గూడెం సభలో సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తు అధికారం కోసం కాదని.. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును బాగు చేయడం కోసమని చంద్రబాబు అన్నారు.
2/7
తాడేపల్లి గూడెం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తేజభరితంగానే మాట్లాడుతూ కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. ఇంతకు ముందు జరిగిన తన ఓటమిని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకించి సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు, నేను రాష్ట్రం కోసమే కలిసి పని చేస్తామంటూ స్పష్టం చేశారు.
3/7
తాడేపల్లి గూడెం సభలో అగ్రనేతలు ఇద్దరూ చేయీ చేయి కలుపుతూ తమ కూటమి ఎంత గట్టిగా ఉందన్న సంకేతాన్ని ప్రజలకు చూపుతున్న దృశ్యం.
4/7
తాడేపల్లి గూడెం సభలో వేదికపై ఆశీనులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, నాదెండ్ల మనోహర్, స్థానిక మహిళా నేత తదితరులను చూడవచ్చు.
5/7
తెలుగు జన విజయ కేతనం జెండా పేరిట పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడు.
6/7
తాడేపల్లి గూడెం, ప్రత్తిపాడు వద్ద జరిగిన సభ వద్ద వేదికపై కూర్చుని ముచ్చటించుకుంటూ.. చిరునవ్వులు చిందిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్..
7/7
తాడేపల్లి గూడెం, ప్రత్తిపాడు వద్ద జరిగిన సభకు విచ్చేసిన టీడీపీ, జనసేన మహిళా కార్యకర్తలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ నమస్కరిస్తూ పలుకరిస్తున్న దృశ్యం.
Updated at - Mar 01 , 2024 | 07:34 AM