Deputy CM: దుర్గమ్మ సన్నిధిలో మెట్ల పూజ చేసిన పవన్ కల్యాణ్
ABN, Publish Date - Sep 24 , 2024 | 12:58 PM
విజయవాడ: ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిషనర్, ఈవో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయ మెట్లను శుద్ధిచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టారు. తర్వాత మెట్ల పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
1/7
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి విచ్చేశారు.
2/7
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో ఆలయం మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...
3/7
దుర్గమ్మ సన్నిధిలో మెట్లకు పసుపు రాసి.. కుంకుమ బొట్టు పెడుతున్న పవన్ కల్యాణ్..
4/7
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో మెట్లకు పసుపు రాసి.. కుంకుమ బొట్టు పెట్టి.. కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్న డిప్యూటీ సీఎం..
5/7
కనకదుర్గమ్మ సన్నిధిలో పూజలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్.. తలపై అక్షంతలు వేసి ఆశీర్వదిస్తు్న్న అర్చకుడు..
6/7
అమ్మవారి చిత్రపటాన్ని పవన్ కల్యాణ్‌కు బహూకరిస్తు్న్న ఆలయ అధికారులు, అర్చకులు..
7/7
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియా సమావేశంలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్..
Updated at - Sep 24 , 2024 | 12:58 PM