తాడేపల్లిగూడెంలో పవన్ ఎన్నికల ప్రచార దృశ్యాలు..
ABN, Publish Date - Apr 30 , 2024 | 10:57 AM
తాడేపల్లిగూడెం: ‘పేకాట క్లబ్‌ల మీద ఉన్న శ్రద్ధ పాలనపై లేదు’ అంటూ జనేన అధినేత పవన్‌కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం వారాహి విజయ యాత్ర సభలు ఆశేష జనవాహిని మధ్య జరిగాయి. గణపవరం సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనను ఎండగట్టారు. ‘వాసు బాబు వద్దు.. వైసీపీ పాలన వద్దు’.. అంటూ సభికులతో అనిపించారు. ‘తన ఇంటిముందు రోడ్డు వేసుకోలేని ఎమ్మెల్యే వాసుబాబు మనకేం చేస్తాడు. ఇది పేకాట ప్రభుత్వం. చుట్టూరా గోదావరి జలాలు ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకని పరిస్థితి ఉంది. గోదావరి నది నుంచి గ్రామాలకు తాగునీటి సదుపాయం కల్పిస్తామని పవన్ అన్నారు.
1/6
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయ యాత్ర సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.
2/6
తాడేపల్లిగూడెంలో సోమవారం పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయ యాత్ర సభలో ఆశేష జనవాహిని
3/6
ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, గణపవరంలో వారాహి విజయ యాత్ర సభలో ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్..
4/6
ఉంగుటూరు మండలం, గణపవరంలో జనసేనాని నిర్వహించిన రోడ్ షోకు తరలివచ్చిన ప్రజలకు నమస్కరిస్తున్న పవన్ కల్యాణ్
5/6
ఉంగుటూరు నియోజక వర్గంలోని గణపవరంలో వారాహి విజయ భేరీ సభలో పార్టీ గుర్తు, అభ్యర్ధిని చూపిస్తున్న పవన్ కల్యాణ్..
6/6
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, గణపవరం వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.
Updated at - Apr 30 , 2024 | 10:57 AM