Bhuvaneswari: ప్రాణం ఉన్నంతవరకు కార్యకర్తలకు అండగా ఉంటాం..
ABN, Publish Date - Feb 15 , 2024 | 12:50 PM
ధర్మవరం: ప్రాణం ఉన్నంతవరకు టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ఆమె కనగానపల్లి, రామగిరి మండలాల్లో బుధవారం పర్యటించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తీవ్ర మనోవేదనతో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. వేపకుంట గ్రామ టీడీపీ కార్యకర్త బెస్త నారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఆమె రూ.3 లక్షల చెక్కును అందించారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్బంగా చేనేత మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు.
1/6
‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ధర్మవారం పర్యటనకు వచ్చిన నారా భువనేశ్వరి.. చేనేత మహిళల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న దృశ్యం.
2/6
తిరుమల శ్రీవారి నామాల చిత్రపటాన్ని నారా భువనేశ్వరికి బహుకరిస్తున్న చేనేత మహిళలు..
3/6
చేనేత పట్టువస్త్రాల గురించి నారా భువనేశ్వరికి వివరిస్తున్న ధర్మవరం టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్..
4/6
నారా భువనేశ్వరి నిర్వహించిన చేనేత మహిళల కార్యక్రమానిక పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు..
5/6
వెంకటాపురం గ్రామంలో పరిటాల రవీంద్ర ఘాట్‌వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన నారా భువనేశ్వరి.. ప్రక్కన పరిటాల సునీత, శ్రీరాం, పంచమర్తి అనూరాధ తదితరులను చూడవచ్చు.
6/6
‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ధర్మవారం పర్యటనకు వచ్చిన నారా భువనేశ్వరిపై పూలవర్షం కురిపిస్తూ అభిమానం చాటుకున్న టీడీపీ శ్రేణులు..
Updated at - Feb 15 , 2024 | 12:50 PM