నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర.. బాధితులకు ఆర్థిక సాయం
ABN, Publish Date - Jan 04 , 2024 | 12:04 PM
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరిట చేపట్టిన యాత్ర మళ్లీ ప్రారంభించారు. మూడు రోజులపాటు పర్యటనలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లాలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
1/8
‘నిజం గెలవాలి’ పేరిట యాత్ర చేపట్టిన నారా భువనేశ్వరి బుధవారం విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, పెరుమాలిలో పర్యటించారు. ఈ సంధర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చిన దృశ్యం.
2/8
విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, పెరుమాలిలో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై మరణించిన కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శిస్తున్న దృశ్యం..
3/8
చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై మరణించిన కోరాడ అప్పారావు చిత్రపటానికి భువనేశ్వరి పూలమాలవేసి నివాళులర్పించారు.
4/8
కోరాడ అప్పారావు కుటుంబానికి తాము అండగా ఉంటామని నారా భువనేశ్వరి భరోసా ఇస్తూ.. చెక్ అందజేసిన దృశ్యం.
5/8
నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ పేరిట యాత్రకు భారీగా తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. చిత్రంలో టీడీపీ నేత కళా వెంకటరావును చూడవచ్చు.
6/8
‘నిజం గెలవాలి’ యాత్రకు భారీగా తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటిస్తున్న నారా భువనేశ్వరి..
7/8
విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, మోదుక వలసలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా భువనేశ్వరికి మహిళలు స్వాగతం పలుకుతున్న దృశ్యం..
8/8
చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మోదుగవలస గ్రామంలో గులిపల్లి అప్పారావు మృతి చెందారు. భాధిత కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.. ఆర్థిక సహాయంగా చెక్ అందజేస్తున్న దృశ్యం.
Updated at - Jan 04 , 2024 | 12:04 PM