Lokesh: సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి లోకేష్
ABN, Publish Date - Sep 26 , 2024 | 10:36 AM
విశాఖపట్నం: సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న లోకేష్‌కు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు లోకేష్‌కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
1/6
విశాఖపట్నం: సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి విచ్చేస్తున్న మంత్రి నారా లోకేష్..
2/6
సింహాద్రి అప్పన్న స్వామివారి అంతరాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు..
3/6
వేదపండితులు మంత్రి లోకేష్‌కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేస్తున్న దృశ్యం...
4/6
రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌కు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తు్న్న ఆలయ అధికారులు..
5/6
సింహాద్రి అప్పన్న ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని పూజలు చేస్తున్న మంత్రి నారా లోకేష్..
6/6
విశాఖపట్నం: సింహాచలం ఆలయం వద్ద ఓ చిన్నారితో మంత్రి నారా లోకేష్ ..
Updated at - Sep 26 , 2024 | 10:36 AM