Lokesh: చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన..
ABN, Publish Date - Sep 20 , 2024 | 11:29 AM
చిత్తూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి బంగారుపాళ్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. భారీగా మహిళలు, యువకులు రోడ్లపైకి వచ్చి యువనేతను స్వాగతించారు. లోకేష్ బస చేసిన ప్రాంతానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎన్నికల హామీ మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించనున్నారు. లోకేశ్‌తోపాటు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సయితం పర్యటనలో పాల్గొననున్నారు. మంత్రులు పర్యటించే గ్రామాలకు ఇప్పటికే పెద్దఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు.
1/7
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం చేరుకున్న మంత్రి నారా లోకేష్..
2/7
భారీగా రోడ్లపైకి వచ్చి యువనేత లోకేష్‌ను భారీ గజమాలతో ఘన స్వాగతం పలికిన మహిళలు, యువకులు..
3/7
రాత్రయిన తన కోసం వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలుపుతున్న మంత్రి నారా లోకేష్..
4/7
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు నుదుట కుంకుమ దిద్ది, హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు..
5/7
టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ దిగుతున్న మంత్రి నారా లోకేష్..
6/7
స్థానికుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్న నారా లోకేష్..
7/7
బంగారుపాళ్యంలో స్థానిక మహిళలతో మంత్రి నారా లోకేష్ మాటా మంతి..
Updated at - Sep 20 , 2024 | 11:29 AM