Rain Alert: శ్రీకాకుళంలో జిల్లాలో భారీ వర్షాలు..
ABN, Publish Date - Sep 09 , 2024 | 10:37 AM
శ్రీకాకుళం జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగావళి, వంశధార ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వరద ముప్పు పొంచి ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బస్టాండ్, లోతట్టు ప్రాంతాలు, రహదారులపై వరదనీరు చేరి జలమయమయ్యాయి. వర్షపునీటితో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇదే రీతిన మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు.
1/6
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
2/6
భారీ వర్షాలతో చెరువును తలపిస్తున్న శ్రీకాకుళం బస్టాండ్..
3/6
రహదారులపై నిలిచిన వరదనీరు.. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..
4/6
వరద నీటితో మునిగిన పంట పొలాలు.. చెరువును తలపిస్తున్న దృశ్యం..
5/6
భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి.. క్రమంగా నాగావళికి పెరుగుతున్న వరద ఉధృతి..
6/6
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన హైవే రోడ్లు..
Updated at - Sep 09 , 2024 | 10:37 AM