Tirumala: శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం..
ABN, Publish Date - Jun 13 , 2024 | 12:13 PM
తిరుమల: సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ప్రమాణ స్వీకారనంతరం ఆయన తన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు. గురువారం ఉదయం సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబు కుటుంబానికి వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు.
1/7
తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం..
2/7
తిరుమల స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభాన్ని తాకి పూజలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు కుటుంబం..
3/7
తిరుమల శ్రీ రంగనాయకుల మండపం వద్ద చంద్రబాబు కుటుంబం..
4/7
తిరుమల రంగనాయకుల మండపం వద్ద భక్తులతో చంద్రబాబు నాయుడు కుటుంబం..
5/7
శ్రీవారి దర్శనానికి వైకుంఠ ద్వారం నుంచి వెళుతున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు కుంటుంబం..
6/7
తిరుమలలో సాధారణ భక్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం..
7/7
తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబాన్ని చూసి ఉత్సాహంగా చేతులు ఊపుతున్న పిల్లలు, పెద్దలు..
Updated at - Jun 13 , 2024 | 12:13 PM