TDP: దెందులూరు, తెనాలిలో చంద్రబాబు ప్రజాగళం..
ABN, Publish Date - May 01 , 2024 | 01:33 PM
ఏలూరు, గుంటూరు: పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేనివాడు ఒక నాయకుడా అని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. పిల్లలను గంజాయిపరం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదేళ్లలో చేయబోయే పనులని.. అంతేగానీ ఇంట్లో కూర్చుని బటన్ నొక్కేస్తానంటే కుదురుతుందా అని నిలదీశారు. ‘నేనేమీ చేయలేనంటా.. ఈ మగాడు పెద్దగా చేస్తాడంటా.. చూశారుగా ఏం చేశాడో ఇప్పటివరకు’ అని ఎద్దేవా చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో అదిరిపోయిందని.. సైకో మేనిఫెస్టో కిందకు దిగిపోయిందన్నారు. ప్రజాగళంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఏలూరు జిల్లా దెందులూరు, రాత్రికి గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.
1/7
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఏలూరు జిల్లా, దెందులూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.
2/7
ఏలూరు జిల్లా, దెందులూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రసంగిస్తున్న దృశ్యం.
3/7
ఏలూరు జిల్లా, దెందులూరులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం సభకు మండుటెండను సయితం లెక్క చేయకుండా భారీగా తరలి వచ్చిన ప్రజలు..
4/7
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.
5/7
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా, తెనాలిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న దృశ్యం...
6/7
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా, తెనాలి పర్యటనకు వచ్చిన సందర్భంగా స్థానిక కూటమి నేతలు ఆయనకు పుష్పగుచ్చములిస్తున్న దృశ్యం..
7/7
గుంటూరు జిల్లా, తెనాలిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..
Updated at - May 01 , 2024 | 01:33 PM