Kutami: అమలాపురంలో బాబు, పవన్ ఎన్నికల ప్రచారం
ABN, Publish Date - Apr 12 , 2024 | 01:55 PM
అమలాపురం: కోనసీమలో గన్నవరం గర్జించించింది.. అమలాపురం అదరగొట్టింది.. కోనసీమ టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యా ణ్‌లకు నీరాజనసీమగా మారింది..ఎటు చూసినా జనమే.. ఎక్కడ చూసినా జనమే.. ఎక్కడి కక్కడ పువ్వులు చల్లుతూ అభిమాన నేతలకు ఘనంగా స్వాగతం పలికారు.. కోనసీమ అభిమానం రుచి చూపించారు..టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రోడ్‌షోకు ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతాలు పలికారు. మహిళలైతే రోడ్లపైకి వచ్చి హారతులు ఇచ్చారు. ఆరు కిలోమీటర్ల రోడ్‌షో గంటన్నర సమయం పైగా సాగింది. రోడ్లకు ఇరువైపులా వేల సంఖ్యలో ప్రజలు బారులు తీరి స్వాగతం పలికారు. అంబాజీపేటలో మెయిన్‌రోడ్డుమీదా, అమలాపురంలో గడియార స్తంభం సెంటర్‌లో సభ, రోడ్‌షో సుమారు నాలుగు గంటలపాటు జరిగాయి.
1/5
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అమలాపురానికి వచ్చిన సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.
2/5
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లకు అభిమానులు పూల వర్షం కురుపిస్తూ.. మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలుకున్న దృశ్యం.
3/5
అమలాపురంలో గడియార స్తంభం సెంటర్‌లో రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
4/5
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.
5/5
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో నిర్వహంచిన రోడ్ షోకు భారీగా తరలివచ్చిన జనసందోహం..
Updated at - Apr 13 , 2024 | 03:46 PM