Amit Shah: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా
ABN, Publish Date - Jun 01 , 2024 | 10:48 AM
తిరుమల: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో సతీమణి సోనాల్ షాతో కలిసి ఆలయంలోకి వెళ్లి ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత శ్రీవారిని దర్శించుకున్న అనంతరం హుండీలో కానుకలు సమర్పించి, రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఈవో ధర్మారెడ్డి శ్రీరాములవారి చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందజేశారు.
1/5
తిరుమల పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా శుక్రవారం ఉదయం ధ్వజస్తంభాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తున్న దృశ్యం.
2/5
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బయటకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా ఆయన సతీమణి సోనాల్ షా..
3/5
రంగనాయక మండపంలో కేంద్రమంత్రి అమిత్ షా దంపతులు..
4/5
గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రి అమిత్ షా.. రోడ్డు మార్గంద్వారా తిరుమలకు బయలుదేరుతున్న దృశ్యం.
5/5
తిరుమలలో అతిథి గృహానికి విచ్చేసిన కేంద్రమంత్రి అమిత్ షాకు శాలువతో సన్మానిస్తున్న బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి..
Updated at - Jun 01 , 2024 | 10:48 AM