Share News

TDP Ireland: ఐర్లాండ్‌ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం.. విజయం తథ్యం అని ధీమా..!

ABN , Publish Date - Jan 31 , 2024 | 09:15 PM

TDP Ireland: టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఐర్లాండ్‌లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్ ద్వారా టీడీపీ ఏపీ జనరల్ సెక్రటరీ చింతకాయల విజయ్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొని ప్రసంగించారు. తొలుత మాట్లాడిన విజయ్.. తెలుగు దేశం పార్టీ బలం, ధైర్యం కార్యకర్తలేనని అన్నారు.

TDP Ireland: ఐర్లాండ్‌ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం.. విజయం తథ్యం అని ధీమా..!
TDP Ireland

TDP Ireland: టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఐర్లాండ్‌లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్ ద్వారా టీడీపీ ఏపీ జనరల్ సెక్రటరీ చింతకాయల విజయ్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొని ప్రసంగించారు. తొలుత మాట్లాడిన విజయ్.. తెలుగు దేశం పార్టీ బలం, ధైర్యం కార్యకర్తలేనని అన్నారు. తాము ఎన్ని పోరాటాలు చేసిన తమపై ఎన్ని వందల అక్రమ కేసులు బనాయించినా.. కార్యకర్తలు ఉన్నారనే ధైర్యమే తమను ముందుకు నడిపిస్తుందన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన దమన కాండకు ప్రతి ఒక్కళ్ళు అన్యాయం అయిపోయారన్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు ఏపీలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి మొదటి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కూటమి విజయం దాదాపు ఖాయమైపోయిందన్నారు. ఈ విషయాన్ని అనేక సర్వేలు తెలియజేశాయన్నారు విజయ్. చిన్న దేశం అయిన ఐర్లాండ్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ.. యూరప్‌లోని వివిధ దేశాలతో సమన్వయం చేస్తున్న టీడీపీ యూరప్ విభాగంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు చింతకాలయ విజయ్.

చంద్రబాబు ఓ సెర్చ్ ఇంజిన్: వంగలపూడి అనిత

వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఇంత మంది తెలుగు వారిని ఒకేచోట చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగు మహిళా శక్తిని చాటేలా అత్యధిక సంఖ్య లో మహిళలు పాల్గొనటం సంతోషకరం అన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి, మహిళలకు అండగా నిలిచే పార్టీ అని ఈ సమావేశానికి వచ్చిన మహిళలను చూస్తే అర్థమవుతుంన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు టీడీపీ కూటమిని గెలిపిద్దామా? అని రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు అనిత. ఈ సందర్భంగా టీడీపీ ఐర్లాండ్ మహిళా సభ్యురాలు దీప్తి అడిగిన ప్రశ్నలకు అనిత్ సమాధానం ఇచ్చారు. పార్టీ, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని అన్నారు. చంద్రబాబు ఇక సెర్చ్ ఇంజిన్ వంటివారని, మనకు తెలియని ఎన్నో విషయాలను ఆయనను చూసి, ఆయనతో మాట్లాడి నేర్చుకోవచ్చునని అన్నారు అనిత.

పుస్తకావిష్కరణ..

ఈ కార్యక్రమం మధ్యలో పెద్ది రామారావు రాసిన ‘డీకోడ్ ది లీడర్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామారావు.. చంద్రబాబుపై రాసిన ఈ పుస్తకంలోని కొంత సమాచారాన్ని సభకు హాజరైన సభ్యులకు తెలియజేశారు. అనంతరం టీడీపీ యువ నేత, టీడీపీ టార్చ్ బారియర్ అయిన నారా లోకేష్ బర్త్ ‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

త్వరలోనే గ్రాండ్ సెలబ్రేషన్స్..

ప్రముఖ్ గోగినేని మాట్లాడుతూ.. జగన్ పని అయిపోయిందని, మరో 3 నెలల్లో టీడీపీ గెలిచిన తరువాత గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతాయని అన్నారు. విజయ్ అడుసుమిల్లి మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ కూటమి విజయం ఎప్పుడో ఫిక్స్ అయ్యిందని, ఎన్నికలు మాత్రం టీడీపీ కూటమికి వచ్చే సీట్స్, మెజార్టీ ఎంత అనేది తెలుసుకోవడానికేనని అన్నారు. టీడీపీ కూటమిని గెలిపించాలని ఆంధ్ర ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారని అన్నారు.

విజయం ఫిక్స్.. అయినప్పటికీ..

ఎన్నికల కార్యాచరణలో భాగంగా సభాధ్యక్షులు కిషోర్ బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రధేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయిందన్నారు. ప్రజలందరూ టీడీపీకి బ్రహ్మ రథం పట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ.. రాబోయే 90 రోజులు ఇంకా బాగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని అజెండాలు రూపొందించుకుని.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఐర్లాండ్ టీడీపీ సెల్‌ సభ్యులకు దిశానిర్దేశం చేశారు కిషోర్ బాబు. ఇందులో భాగంగా వివిధ కమిటీలను నియమించారు.

కమిటీల నియామకం..

సోషల్ మీడియా ప్రచార కమిటీ, ఫోన్ ద్వారా ప్రజలకు పార్టీ సందేశం అందచేసేవారు, క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొనే వారు.. ఇలా కొన్ని కమిటీలను నియమించారు. ముఖ్యంగా టీడీపీ ఐర్లాండ్, టీడీపీ యూరప్ సంయుక్తంగా 4 నుండి 8 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని, వాటిలో గ్రామస్థాయి నుండి ప్రచారంలో పాల్గొనాలని తీర్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం, సహకారం అందించిన ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ రవి కుమార్‌కి ఐర్లాండ్ టీడీపీ సెల్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సమావేశంలో పాల్గొన్నవారు..

ఈ ఎన్నికల శంఖారావంలో ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ తరుఫున ముఖ్య ఆఫీస్ బారియర్స్, కార్యవర్గ సభ్యులు, అధికార ప్రతినిధులు కిశోర్ బాబు చలసాని, కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, రంగా గల్లా, శివ బాబు వేములపల్లి, ప్రముఖ్ గోగినేని, అచ్చుత కిషోర్ కొత్తపల్లి, మీరా కుమార్, కోటెంద్ర లెళ్ళ, విజయ్ కృష్ణ చందోలు, నరేంద్ర ముప్పవరపు, సాయి పవన్ రాజేష్ శర్మ, రవి రెడ్డి బాదం, నాగరాజు జడ, సీత రామ్ చల్లగుండ్ల, ప్రదీప్ కొమ్మినేని, రామకృష్ణ ఏలూరు, సుభాకర్ రామినేని, చంద్రశేఖర్, సుఖేష్ కొల్లూరి, నవీన్ మామిళ్లపల్లి, అనిల్ యార్లగడ్డ, టీడీపీ ఆడపడుచులు దీప్తి అగ్తీల, సీత మహాలక్ష్మి, పృథ్విక, తులసి పరుచూరి సహా 170 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, టీడీపీ ఐర్లాండ్ అధ్యక్షుడు భారత్ భాష్యం సభా ఏరాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Jan 31 , 2024 | 09:16 PM