Share News

Pumpkin juice : బూడిది గుమ్మడి కాయ జ్యూస్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటి?

ABN , Publish Date - Apr 01 , 2024 | 02:53 PM

బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణక్రియకు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇది యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది.

Pumpkin juice : బూడిది గుమ్మడి కాయ జ్యూస్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటి?
Pumpkin juice

ఈ మధ్య జనాల్లో ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. దీనితో ప్రకృతిలో మనం తినే ఆహారంలో ఏది శరీరానికి పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుందో కూడా తెలుసుకుంటున్నారు. తక్కువగా ఉపయోగించే ఆహారంలో ఉండే పోషకాలను దృష్టిలో పెట్టుకుని మరీ తీసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకునే కూరగాయ బూడిద గుమ్మడి. దీనితో వడియాలు తయారు చేస్తారు. అలాగే గుమ్మానికి దిష్టి తగలకుండా కడతారు. కొన్ని రకాల స్వీట్స్ లో కూడా ఈ గుమ్మడికాయను వాడతారు. అయితే వ్యర్థాలను తొలగించే విధానంలో గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని జ్యూస్ చేసుకుని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయట. వాటిలో ముఖ్యంగా..

బూడిద గుమ్మడిని వింటర్‌మిలన్‌ అనీ, సంస్కృతంలో కుష్మాండ , బృహత్ఫల, ఘృణావాస, గ్రామ్యకర్కటి, కర్కారు అని కూడా అంటారు. ఇది ఆరిజన్‌ ఎక్కడ అనేదానిపై స్పష్టత లేనప్పటికీ జపాన్, ఇండోనేషియా, చైనా లేదా ఇండో-మలేషియాలో పుట్టి ఉంటుందని అంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గుమ్మడితో చేసి తీసుకునే జ్యూస్ అనేక మంచి ఫలితాలను అందిస్తుంది. కానీ చాలా వరకూ దీని రుచి నచ్చదు. కాకపోతే పోషకాల పరంగా దీనిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

గుమ్మడికాయ జ్యూస్‌ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాలలో ఇది కూడా ఒకటి. ఇందులోని బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి.

ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..

అయితే బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. 4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ , కాపర్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సీ ఉంటాయి. ఇవి పూర్తి శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.

బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణక్రియకు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇది యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది.

బూడిద గుమ్మడికాయ రసంలో యాంజియోలైటిక్ లక్షణాలున్నాయి. ఇది నాడీ వ్యవస్థకుమంచిది. డిప్రెషన్‌, ఆందోళనతో బాధపడేవారికి చాలా మంచిది. మూర్ఛవ్యాధితో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది.


ఇది కూడా చదవండి: గోరు వెచ్చని నీరు, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. ఎన్ని బెనిఫిట్సో తెలుసా..!

జ్వరంతో బాధపడుతున్నవారు, చలువ గుణం కలిగి ఉన్నందున జలుబుతో బాధపడుతున్న వారు దీనిని తినకూడదు. బ్రోన్కైటిస్ ,ఆస్తమా పేషంట్లు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు వైద్యుల సలహా మేరకే దీన్ని తీసుకోవాలి.

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్‌ ఆప్షన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్‌. ఇది కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువ, జీరో ఫాట్ లక్షణాలు పైగా ఫైబర్‌ ఎక్కువ. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఉబకాయాన్ని నిరోధిస్తుంది. కాబట్టి గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. గుమ్మడికాయలో విటమిన్ B3 అధికం. ఇది శక్తినిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యానికి , సౌందర్యానికి మేలు చేస్తుంది. యాంటి ఏజింగ్‌గా పనిచేస్తుంది. ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ కేన్సర్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 02:54 PM