Share News

Lemon Water : గోరు వెచ్చని నీరు, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. ఎన్ని బెనిఫిట్సో తెలుసా..!

ABN , Publish Date - Mar 30 , 2024 | 02:20 PM

నిమ్మకాయ నీరు గుండె ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. పొటాషియం కంటెంట్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ధమనులకు ఆక్సీకరణ నష్టాన్ని నివారించి గుండె ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Lemon Water : గోరు వెచ్చని నీరు, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. ఎన్ని బెనిఫిట్సో తెలుసా..!
Lemon water

నిమ్మకాయ నీటిని తేనెతో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి అందరికీ తెలుసు.. దానితో బరువు సులువుగా తగ్గచ్చుననే ఆలోచన అందరిలోనూ ఉంటుంది. ఈ కారణంగా చాలా ప్రయోజనాలను పొందవచ్చు. తేనెతో కలిపి నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, రిఫ్రెష్ టాంగ్ తో నిండినిన సిట్రస్ అనేక ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది. ఉదయం లేవగానే మన దినచర్యను నిమ్మరసంతో మొదలుపెడితే అదీ గోరువెచ్చని నీటితో ఈ రసాన్ని తీసుకుంటే..

రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

ఆర్ద్రీకరణను పెంచుతుంది.

నిమ్మకాయ నీటితో హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. చర్మ నిగారింపును ఇస్తుంది. శరీరం ఉత్తమంగా పనిచేస్తుంది.

విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

నిమ్మకాయలు విటమిన్ సి మూలం. రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తుంది. వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇది మలబద్దకాన్ని, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రధానంగా నిమ్మరసాన్ని మోతాదుకు మించి తీసుకుంటే సమస్యలు కూడా తప్పవు.

ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..


గుండె ఆరోగ్యానికి..

నిమ్మకాయ నీరు గుండె ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. పొటాషియం కంటెంట్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ధమనులకు ఆక్సీకరణ నష్టాన్ని నివారించి గుండె ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.

నిమ్మకాయనీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా విటమిన్ సి, ఆరోగ్యకరమైన ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది. మచ్చలు, ముడతలు వంటి సమస్యలను తగ్గించి చర్మానికి నిగారింపును తెస్తుంది.

కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది.

నిమ్మకాయలలోని సిట్రిక్ యాసిడ్ మూత్ర పిండాల సిట్రైట్ స్థాయిలను పెంచడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. అదే నిమ్మకాయను ఎక్కువగా తీసుకునే వారిలో ఆక్సలేట్ కంటెంట్ పెరిగి మూత్రపిండాల్లో రాళ్లకు కారణం అవుతుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 02:21 PM