Share News

Egg Yolks: గుడ్డు పచ్చసొన తినొచ్చా? తినకూడదా? డైటీషియన్స్ సూచనలు మీకోసం..

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:19 PM

Egg Yolks: గుడ్లు అంటే చాలా మంది ఇష్టం. ఇంట్లో ఒక పూట కూర వండకపోతే.. వెంటనే రెండు గుడ్లు(Eggs) తెచ్చి కర్నీ వండుకుని తినేస్తుంటారు. మరికొందరు ఆరోగ్యం(Health) కోసం రోజూ ఉదయం ఒక బాయిల్డ్ ఎగ్ తింటారు. అయితే, హెల్త్ కోసం అని కొంతరు గుడ్డులోని పచ్చ సొన(Egg Yolk) తీసేసి తింటారు.

Egg Yolks: గుడ్డు పచ్చసొన తినొచ్చా? తినకూడదా? డైటీషియన్స్ సూచనలు మీకోసం..
Egg Benefits

Egg Yolks: గుడ్లు అంటే చాలా మంది ఇష్టం. ఇంట్లో ఒక పూట కూర వండకపోతే.. వెంటనే రెండు గుడ్లు(Eggs) తెచ్చి కూరను వండుకుని తినేస్తుంటారు. మరికొందరు ఆరోగ్యం(Health) కోసం రోజూ ఉదయం ఒక బాయిల్డ్ ఎగ్ తింటారు. అయితే, హెల్త్ కోసం అని కొంతరు గుడ్డులోని పచ్చ సొన(Egg Yolk) తీసేసి తింటారు. కానీ, గుడ్డు పచ్చ సొనలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అయితే, శరీరంలో ఇప్పటికే కొవ్వు అధికంగా ఉంటే మాత్రం గుడ్డులోని పచ్చ సొనను తీసేసి తినడం ఉత్తమం. మరి ఇంతకీ గుడ్డులోని పచ్చ సొన తినడం ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? కీలక వివరాలు తెలుసుకుందాం.

గుడ్డు పచ్చసొన తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

1. గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

2. గుడ్డు పచ్చసొనలో కోలిన్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి, పనితీరుకు అవసరం.

3. గుడ్డు పచ్చసొనలో యాంటీ ఆక్సిడెంట్లు లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

4. గుడ్డు పచ్చసొనలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. వీటిని పరిమిత పరిమాణంలో తింటే బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

5. గుడ్డు సొనలు రోజంతా శక్తిని అందించగల అధిక-నాణ్యత ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి.

6. గుడ్డు పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి హెచ్‌డీఎల్ స్థాయిని పెంచుతాయి. అంటే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

7. గుడ్డు పచ్చసొనలో ఉండే విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. బలమైన ఎముకలను ప్రోత్సహిస్తుంది.

8. గుడ్డులోని పచ్చసొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ స్థితిస్థాపకతను పెంచి, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.

గుడ్డు పచ్చసొన తినడం వలన కలిగే నష్టాలు..

1. గుడ్డు పచ్చసొనలో డైటరీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

2. గుడ్డు పచ్చసొన ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

3. గుడ్లకు ఎలర్జీ ఉన్నవారు పచ్చసొన తినడం వల్ల సమస్యలను ఎదురయ్యే అవకాశం ఉంది.

4. పచ్చి లేదా తక్కువ ఉడికించిన గుడ్డు పచ్చసొనలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది.

5. గుడ్డు పచ్చసొనలో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.

6. కోడిగుడ్డు పచ్చసొనను తీసుకోవడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

గమనిక: ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా, ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఈ కథనాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఏమైనా అనారోగ్య సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 20 , 2024 | 02:14 PM