Share News

Banana Benefits: రోజుకు ఎన్ని అరటిపండ్లు తినొచ్చు? తప్పక తెలుసుకోండి..!

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:16 AM

Banana Benefits: రోజూ అరటి పండు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు(Health Experts) చెబుతుంటారు. ఎందుకంటే అరటి పండులోని(Banana) పోషకాలు శరీరానికి(Proteins) ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది భోజనం తర్వాత అరటిపండు తింటుంటారు. అరటిపండును కొంత మంది సలాడ్, జ్యూస్‌లా కూడా తీసుకుంటారు.

Banana Benefits: రోజుకు ఎన్ని అరటిపండ్లు తినొచ్చు? తప్పక తెలుసుకోండి..!
Banana Benefits

Banana Benefits: రోజూ అరటి పండు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు(Health Experts) చెబుతుంటారు. ఎందుకంటే అరటి పండులోని(Banana) పోషకాలు శరీరానికి(Proteins) ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది భోజనం తర్వాత అరటిపండు తింటుంటారు. అరటిపండును కొంత మంది సలాడ్, జ్యూస్‌లా కూడా తీసుకుంటారు. అంతేకాదు.. దేవుడికి నైవేద్యంగానూ సమర్పిస్తారు. శుభకార్యాల్లో భోజనం తరువాత అరటి పండు అందించడం, తాంబూలంలో అరటిపండు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అరటి పండుకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది మరి.

అరటిపండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవడానికి అరటిపండును ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి అని చెబుతారు ఆరోగ్య నిపుణులు. అయితే, చాలా మంది బరువు పెరుగుతారనే భయంతో అరటి పండ్లను తినకుండా ఉంటారు. వాస్తవానికి అరటిపండ్లు బరువు తగ్గడంలో సహాయపడుతాయట. అరటిపండ్లు తింటే పొట్ట ఎక్కువ సమయం నిండినట్లుగా ఉంటుంది. ఫలితంగా తక్కువ తినేలా చేస్తుంది. అయితే, అరటి పండ్లను అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఆరోగ్య నిపుణుల తెలిపిన సమాచారం ప్రకారం.. అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. రోజూ అరటిపండు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని 2014లో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

ఒక మధ్యస్థ అరటిపండులో దాదాపు 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే అరటిపండ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తినకూడదు. అలాగే రోజూ ఎక్కువ అరటి పండ్లు కూడా తినకూడదు. ప్రతిదానికి ఒక లిమిటి ఉన్నట్లుగానే.. అరటిపండ్లు తినేందుకు కూడా కొంత లిమిట్ ఉందని చెబుతున్నారు నిపుణులు. సాధారణ వ్యక్తులు ప్రతిరోజూ రెండు అరటిపండ్లను తినవచ్చు. వ్యాయామం చేసేవారు మూడు అరటిపండ్లు తినవచ్చు. కానీ మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు అరటిపండును తినడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2024 | 11:16 AM