Share News

Water Benefits: నీరు ఎప్పుడు తాగితే శరీరానికి ప్రయోజనం ఉంటుంది? కీలక వివరాలు మీకోసం..

ABN , Publish Date - Feb 20 , 2024 | 02:29 PM

Water Benefits: అన్నం తినకుండా వారం రోజులైనా ఉంటాం కానీ.. నీరు తాగకుండా ఒక్క రోజు కూడా ఉండలేము. ఈ విషయం అందరికీ తెలిసిందే. నీటితో (Water Benefits) ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయో.. ఆ నీటిని(Water) సరిగా తాగకపోతే అంతకు మించిన సమస్యలు ఉన్నాయి.

Water Benefits: నీరు ఎప్పుడు తాగితే శరీరానికి ప్రయోజనం ఉంటుంది? కీలక వివరాలు మీకోసం..
Water Benefits

Water Benefits: అన్నం తినకుండా వారం రోజులైనా ఉంటాం కానీ.. నీరు తాగకుండా ఒక్క రోజు కూడా ఉండలేము. ఈ విషయం అందరికీ తెలిసిందే. నీటితో (Water Benefits) ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయో.. ఆ నీటిని(Water) సరిగా తాగకపోతే అంతకు మించిన సమస్యలు ఉన్నాయి. నీటిని ఎలా తాగాలనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. చాలా మంది దాహమేసినప్పుడే నీటిని తాగుతారు. కానీ, ఒక నిర్దిష్ట సమయంలో నీరు తాగితే శరీరానికి మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఏ సమయంలో నీరు తాగితే మేలు జరుగుంది? ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారు కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నీరు తాగడానికి సరైన సమయం ఏది?

ఉదయం లేవగానే : ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. రాత్రి మొత్తం ఆహారం తినకపోవడం వలన ఉదయాన్నే శరీరానికి తక్షణ శక్తి అవసరం. అలాంటి పరిస్థితిలో సగం నిమ్మకాయ రసం, ఒక టీ స్పూన్ నెయ్యి, చిటికెడు దాల్చిన చెక్కను నీటిలో కలిపి తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియంను శరీరానికి అందిస్తుంది.

ఆహారం తినే ముందు : తినే ముందు నీరు తాగడం వల్ల జిఐ ట్రాక్ట్ క్లియర్ అవుతుందని, బరువు తగ్గించే ప్రయాణంలో కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ భోజనానికి 30 నిమిషాల ముందు అరలీటర్ నీరు తాగే వ్యక్తులు 12 వారాల్లో 3 కిలోల బరువు తగ్గినట్లు అధ్యయనంలో తేలింది.

నిద్రపోయే ముందు : నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల రాత్రిపూట శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. టాక్సిన్‌లను ఆటోమేటిక్‌గా బయటకు పంపుతుంది. ఇది కాకుండా, నిద్రపోయే ముందు నీరు త్రాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే కడుపు నొప్పి, తిమ్మిరి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

స్నానం చేయడానికి ముందు : స్నానానికి ముందు వేడినీరు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వాస్తవానికి, స్నానం చేయడానికి ముందు వేడి నీటిని తాగడం వల్ల శరీరాన్ని లోపలి నుండి వేడి చేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెమట పట్టిన తర్వాత, మసాజ్ చేసిన తర్వాత నీరు తాగాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 20 , 2024 | 02:29 PM