Share News

Benefits of Corn Silk: మొక్కజొన్న పట్టును పడేస్తున్నారా? ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..!

ABN , Publish Date - Feb 23 , 2024 | 11:29 AM

Benefits of Corn Silk: చాలా మందికి మొక్కజొన్న(Sweet Corn) అంటే ఇష్టం. దీనిని కాల్చి గానీ, ఉడకబెట్టి గానీ తింటాము. వర్షాకాలంలో వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న కంకికి కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం అప్లై చేసి తింటే.. ఆ టేస్టే వేరు. కొందరు మొక్కజొన్న గింజలతో రకరకాల బజ్జీలు చేసుకుని తింటారు. మొక్కజొన్న గింజల్లో ఫైబర్, విటమిన్లు సి. కె. ప్రోటీన్స్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ..

Benefits of Corn Silk: మొక్కజొన్న పట్టును పడేస్తున్నారా? ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..!
Benefits of Corn Silk

Benefits of Corn Silk: చాలా మందికి మొక్కజొన్న(Sweet Corn) అంటే ఇష్టం. దీనిని కాల్చి గానీ, ఉడకబెట్టి గానీ తింటాము. వర్షాకాలంలో వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న కంకికి కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం అప్లై చేసి తింటే.. ఆ టేస్టే వేరు. కొందరు మొక్కజొన్న గింజలతో రకరకాల బజ్జీలు చేసుకుని తింటారు. మొక్కజొన్న గింజల్లో ఫైబర్, విటమిన్లు సి. కె. ప్రోటీన్స్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మొక్కజొన్న ఆరోగ్యానికి(Health) ఎంతో మేలు చేస్తుందని చెబుతారు.

అయితే, చాలా మంది మొక్కజొన్న గింటలను తింటారు కానీ.. దాని చుట్టూ ఉన్న పొట్టును, దారాల మాదిరిగా ఉన్న పట్టు(Corn Silk)ను తొలగించేస్తారు. అయితే మొక్కజొన్న గింజలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. ఆ మొక్కజొన్న పట్టుకు కూడా అంతకంటే ఎక్కువ మేలు చేస్తుందట. ఈ విషయాన్ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి కార్న్ సిల్క్ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

కార్న్ సిల్క్ ఆరోగ్య ప్రయోజనాలు:

1. కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది: ప్రస్తుతం కాలంలో చాలా మంది ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య అధిక కొలెస్ట్రాల్. చాలా మంది ప్రజలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. లేదంటే.. ఇది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అయితే, కార్న్ సిల్క్ తినడం వల్ల రక్తనాళాలలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2. మధుమేహం నియంత్రణ: మధుమేహంతో బాధపడేవారికి మొక్కజొన్న పట్టు ఒక వరంగా పేర్కొంటున్నారు. వీటిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సంపూర్ణంగా నియంత్రిస్తుంది.

3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: కరోనా కాలం నుండి ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బలమైన రోగనిరోధక వ్యవస్థ.. వ్యాధుల వ్యాప్తిని నియంత్రిస్తుంది. మొక్కజొన్న పట్టులో విటమిన్ సి ఉంటుంది. దీనిని ఆహారంగా తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఉదర సంబంధిత సమస్యలతో బాధపడేవారు మొక్కజొన్న పట్టును తీసుకోవచ్చు. ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది.

5. గర్భిణీ స్త్రీలకు మేలు: గర్భిణీ స్త్రీలు మొక్కజొన్న పట్టును తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడుతుంది.

6. కిడ్నీలకు సూపర్ మెడిసిన్: మొక్కజొన్న పిండితో టీ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కజొన్న పట్టు కిడ్నీలకు సూపర్ మెడిసిన్ అంటారు. ఇది కిడ్నీలోని హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఈ టీని రోజూ తాగితే కిడ్నీలో రాళ్లు రాకుండా చూసుకోవచ్చు. కార్న్ సిల్క్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2024 | 11:36 AM