Share News

Sridevi: వామ్మో.. శ్రీదేవి మృతిపై వాదనల కోసం నకిలీ పత్రాలు: సీబీఐ

ABN , Publish Date - Feb 05 , 2024 | 09:45 AM

అందాల నటి శ్రీదేవి మృతిపై యూట్యూబర్ తప్పుడు పత్రాలు చూపించింది. 2018 ఫిబ్రవరి 18వ తేదీన శ్రీదేవి దుబాయ్ బాత్ రూమ్ టబ్‌లో పడ చనిపోయిన సంగతి తెలిసందే. అయితే తాను ప్రమోట్ అయ్యేందుకు శ్రీదేవి మృతి అంశాన్ని వాడుకుంది. శ్రీదేవి మృతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని యూట్యూబ్‌లో చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేసింది.

Sridevi: వామ్మో.. శ్రీదేవి మృతిపై వాదనల కోసం నకిలీ పత్రాలు: సీబీఐ

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: అందాల నటి శ్రీదేవి మృతిపై యూట్యూబర్ తప్పుడు పత్రాలు సృష్టించింది. తాను సోషల్ మీడియోలో ప్రమోట్ అయ్యేందుకు శ్రీదేవి మృతి అంశాన్ని ఎరగా వాడుకుంది. శ్రీదేవి మృతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని యూట్యూబ్‌లో చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేసింది. వాటిని తన సిబ్బంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ), భారత అధికారుల వద్ద నుంచి తీసుకున్నారని పేర్కొంది. ఈ అంశంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. అవి తప్పుడు పత్రాలు అని తేల్చారు. 2018 ఫిబ్రవరి 18వ తేదీన శ్రీదేవి దుబాయ్ బాత్ రూమ్ టబ్‌లో పడి చనిపోయిన సంగతి తెలిసిందే.

మొబైల్స్, ల్యాప్ టాప్ సీజ్

సెలబ్రిటీ చనిపోయిన అంశాన్ని సొంతంగా దీప్తి అనే యూట్యూబర్ విచారించింది. తాను ఫేమస్ కావాలని అనుకుంది. యూట్యూబ్‌లో శ్రీదేవి మృతికి పత్రాలు చూపడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లో దీప్తి మొబైల్స్, ల్యాప్ టాప్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ఆ పత్రాలను ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్‌కు దీప్తి పంపించిందని తెలిపారు. ఆ పత్రాలు ఫేక్ అని సీబీఐ అధికారులు వివరించారు. దీంతో దీప్తిపై చార్జీషీట్ దాఖలు చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

శ్రీదేవి ఒక్కరే కాదు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశ ఇతరుల మృతిపై సొంత పద్ధతిలో దీప్తి దర్యాప్తు చేశారు. ఆ వీడియోలను తన యూట్యూబ్‌ చానెల్‌లో పోస్ట్ చేశారు. శ్రీదేవికి సంబంధించి దుబాయ్ ఆస్పత్రి నుంచి పత్రాలు తీసుకున్నానని దీప్తి చెప్పుకొచ్చారు. అవి తప్పుడు పత్రాలని విచారణలో తేలింది. దీంతో అధికారులు దీప్తిపై చార్జిషీట్ దాఖలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 10:08 AM