Share News

Madhya Pradesh: రేప్‌ చేసి.. బెల్టుతో కొట్టి.. గాయాలపై కారం..

ABN , Publish Date - Apr 20 , 2024 | 09:37 AM

ఆ దుర్మార్గుడి చేతిలో ఆ యువతి చూసింది మాటల్లో చేప్పలేనంత నరకం!! ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాదు.. బెల్టు, నీళ్ల పైపుతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆమె ఒళ్లంతా పచ్చి పండులా తయారైతే.. ఆ గాయాల మీద కారం పొడి చల్లి పైశాచిక ఆనందం పొందాడు. ఆమె పట్ల ఈ దారుణ చేష్టలను..

Madhya Pradesh: రేప్‌ చేసి.. బెల్టుతో కొట్టి.. గాయాలపై కారం..

భోపాల్‌, ఏప్రిల్‌ 20: ఆ దుర్మార్గుడి చేతిలో ఆ యువతి చూసింది మాటల్లో చేప్పలేనంత నరకం!! ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాదు.. బెల్టు, నీళ్ల పైపుతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆమె ఒళ్లంతా పచ్చి పండులా తయారైతే.. ఆ గాయాల మీద కారం పొడి చల్లి పైశాచిక ఆనందం పొందాడు. ఆమె పట్ల ఈ దారుణ చేష్టలను ఒకట్రెండురోజులు కాదు.. ఏకంగా నెలరోజులు సాగించాడు. మధ్యప్రదేశ్‌ గుణలోని శివపురిలో ఈ ఘోరం వెలుగుచూసింది. బాధిత యువతి వయసు 23 ఏళ్లు! నిందితుడు ఆమె ఇంటి పొరుగున ఉండే వ్యక్తే. ఒకానొక రోజు ఆమెను బలవంతంగా తన ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఓ గదిలో నిర్బంధించాడు. తనను పెళ్లి చేసుకోవాలని, ఆమె కుటుంబానికి ఉన్న అస్తినంతా తన పేరిట రాయాలని ఒత్తిడి చేస్తూ ఆ ఉన్మాది ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే అతడి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు.. రాత్రంతా ఐదు కిలోమీటర్లు నడిచి ఓ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Updated Date - Apr 20 , 2024 | 09:37 AM