Share News

BJP: నేను బతికున్నంత కాలం బాల్య వివాహాలను అనుమతించను: అసోం సీఎం

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:06 PM

కాంగ్రెస్ పార్టీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విరుచుకుపడ్డారు. బాల్య వివాహాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నన్నీ రోజులు రాష్ట్రంలో బాల్య వివాహాలు జరగనీయనని స్పష్టం చేశారు.

BJP: నేను బతికున్నంత కాలం బాల్య వివాహాలను అనుమతించను: అసోం సీఎం

గౌహతి: కాంగ్రెస్ పార్టీపై (Congress) మరోసారి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) విరుచుకుపడ్డారు. బాల్య వివాహాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నన్నీ రోజులు రాష్ట్రంలో బాల్య వివాహాలు జరగనీయనని స్పష్టం చేశారు. ముస్లింల వివాహాలు, ముస్లింల విడాకుల రిజిస్ట్రేషన్ యాక్ట్ 1935పై విమర్శలు చేశారు. 2026 లోపు రాష్ట్రంలో బాల్య వివాహాలను నిర్మూలిస్తానని హిమంత బిశ్వ శర్మ శపథం చేశారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను బతికి ఉన్నన్ని రోజులు అసోంలో బాల్య వివాహాలు జరగనీయ. ఇదే అంశంపై ప్రత్యర్థి పార్టీలకు హిమంత బిశ్వ శర్మ సవాల్ విసిరారు. అసోంలో ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం 1935 చట్టం రద్దుకు మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. అసోం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ఇది ముస్లింలపై వివక్ష చూపుతుందని ధ్వజమెత్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 05:06 PM