Share News

Survey on Womens: మేం ఆ ఉద్యోగాలు చేయం.. తేల్చిచెబుతున్న మహిళలు

ABN , Publish Date - Apr 10 , 2024 | 03:06 PM

అత్యధిక వేతనాలు అందించే స్థానంలో టాప్‌లో ఉండేది సాఫ్ట్ వేర్ రంగమే. అయితే ఈ రంగంలో పని చేసే వారికి ఉండే ఒత్తిడి మరే రంగంలోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. వారాంతపు టార్గెట్ల పేరుతో ఉద్యోగులను వెంటాడుతుంటాయి ఐటీ సంస్థల యాజమాన్యాలు. తాజాగా ఈ రంగంలో పని చేస్తున్న మహిళలపై స్కిల్ సాఫ్ట్ ఓ సర్వే నిర్వహించింది.

Survey on Womens: మేం ఆ ఉద్యోగాలు చేయం.. తేల్చిచెబుతున్న మహిళలు

ఇంటర్నెట్ డెస్క్: అత్యధిక వేతనాలు అందించే స్థానంలో టాప్‌లో ఉండేది సాఫ్ట్ వేర్ రంగమే. అయితే ఈ రంగంలో పని చేసే వారికి ఉండే ఒత్తిడి మరే రంగంలోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. వారాంతపు టార్గెట్ల పేరుతో ఉద్యోగులను వెంటాడుతుంటాయి ఐటీ సంస్థల యాజమాన్యాలు. తాజాగా ఈ రంగంలో పని చేస్తున్న మహిళలపై స్కిల్ సాఫ్ట్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఐటీ రంగంలో పని చేస్తున్న మహిళల్లో చాలా మంది ఉద్యోగాలు వదిలేయడానికి సిద్ధమయ్యారట. లింగ అసమానతలు, ఒత్తిడి, ఏఐ రంగ ప్రవేశం తదితర కారణాలతో తాము ఉద్యోగాలను వదిలేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2023 సెప్టెంబర్ నుంచి 2024 జనవరి మధ్య 500 మంది టెక్ మహిళలపై ఈ సర్వే జరిగింది.

మెరుగైన నష్టపరిహారం (28 శాతం), ఎక్కువ ఆదాయం పొందడం కోసం టెక్‌ ఇండస్ట్రీలో 31 శాతం మంది మహిళలు 2025లో తమ సంస్థను వీడాలని ఆలోచిస్తున్నారట. స్కిల్‌ సాఫ్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఓర్లా డాలీ మాట్లాడుతూ.. మా సర్వేలో దాదాపు 85 శాతం మంది మహిళలు తమ బృందంలో లింగ భేదం ఉందని చెప్పారు. 38 శాతం మంది తమ వృద్ధి సామర్థ్యంపై అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు.


"మహిళలకు గతంలో కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ యాజమాన్యం మద్దతు తప్పనిసరి. వారికి క్లిష్టమైన నైపుణ్యాలు నేర్పించాలి. తద్వారా వారు వృద్ధి పథంలో నడవగలరు. నడిపించగలరు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలరు" అని ఆమె అన్నారు.

మహిళలకు ఏఐ టెక్నాలజీలో శిక్షణ కల్పించడం ప్రాముఖ్యతను కూడా నివేదిక నొక్కి చెప్పింది. 41 శాతం మంది మహిళలు AI నేర్చుకోవడానికి ఆసక్తి చూపగా, 60 శాతం మంది ఇంకా తాము చేస్తున్న పనిలో AIని ఉపయోగించడం లేదని చెప్పారు. నేర్చుకోవడానికి శిక్షణ వనరులు తమ సంస్థలో లేవని 63 శాతం మంది మహిళలు చెప్పారు. AIలో మహిళల ప్రమేయం, సాధికారత చాలా అవసరమని డాలీ చెప్పారు.

"వైవిధ్యం ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అందువల్ల AIలో మహిళల నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వ్యాపార సమస్యలకు మరింత సృజనాత్మక, సమానమైన పరిష్కారాల కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది" అని ఆమె తెలిపారు. ఒత్తిడి వల్ల తాము ఉద్యోగాలు వదిలేస్తామని చెప్పిన మహిళలు స్వల్పంగా ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 03:08 PM