Share News

IMD: కాలం మారింది బాస్.. దక్షిణాన ఎండలు.. తూర్పున వానలు..

ABN , Publish Date - Apr 02 , 2024 | 04:23 PM

అవునూ.. కాలం మారింది. వర్షా కాలం లేదు.. చలి కాలం లేదు.. ఉన్నదంతా వేసవి కాలమే. అవును మరి.. సరైన వర్షాలు కురవక తాగునీరు లేక, పంటలు పండక ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండలతో భయభ్రాంతులకు గురవుతున్నారు.

IMD: కాలం మారింది బాస్.. దక్షిణాన ఎండలు.. తూర్పున వానలు..

అవునూ.. కాలం మారింది. వర్షా కాలం లేదు.. చలి కాలం లేదు.. ఉన్నదంతా వేసవి కాలమే. అవును మరి.. సరైన వర్షాలు కురవక తాగునీరు లేక, పంటలు పండక ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండలతో భయభ్రాంతులకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వేసివి కాలం ( Summer ) ప్రారంభమైంది. కానీ.. ఎండ తీవ్రత మాత్రం మే గరిష్ఠాన్ని దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సూర్యుడు ఉదయించడమే లేటు ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యాస్తమయం అయినప్పటికీ ఉక్కపోత, వేడి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక రాత్రి సమయాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

India - China: మీ ఇంటి పేరు మార్చితే అది నాది అవుతుందా.. చైనాకు జై శంకర్ కౌంటర్..

దక్షిణ భారత దేశంలో ఎండలు మండిపోతుంటే తూర్పు భారతంలో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఏడు రోజులు అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చి్మ్ బంగ, దక్షిణ భారత రాష్ట్రాల్లో మాత్రం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఏప్రిల్ 3-5 తేదీల్లో జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో చెదురు ముదురు వర్షాలు కురుస్తాయి.


Viral Video: చెమటలు పట్టించిన చిరుత.. ఇళ్ల పై కప్పు నుంచి దూకుతూ.. వీడియో వైరల్..

మరోవైపు.. ఈ ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిపోతుందని ఐఎండీ హెచ్చరించింది. సాధారణంగా భారత దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. గ్లోబల్ హీట్ రికార్డుల తర్వాత ఈ ఏడాది అత్యధిక వేడిని భారత్ నమోదు చేయవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ సీజన్‌లో ఈశాన్య, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 04:24 PM