Share News

Rahul Gandhi: ప్రభుత్వం మారగానే చర్యలు... కాంగ్రెస్‌కు రూ.1823 కోట్ల పన్ను నోటీసుపై రాహుల్

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:30 PM

రూ.1823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను విభాగం నుంచి నోటీసు రావడంతో కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోంది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ప్రభుత్వం మారిన తర్వాత తాము తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Rahul Gandhi: ప్రభుత్వం మారగానే చర్యలు... కాంగ్రెస్‌కు రూ.1823 కోట్ల పన్ను నోటీసుపై రాహుల్

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ రూ.1823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను విభాగం (IT Department) నుంచి నోటీసు రావడంతో కాంగ్రెస్ (Congress) పార్టీ గుర్రుమంటోంది. ఇది ఆర్థికంగా పార్టీని కృంగదీసే ప్రయత్నమని, టాక్స్ టెర్రరిజమని మండిపడింది. దీనిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సూటిగా స్పందించారు. ప్రభుత్వం మారిన తర్వాత తాము తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.


2017-2018, 2021-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1800 కోట్లకు పైగా డిమాండ్ నోటీసులును కాంగ్రెస్‌ పార్టీకి ఐటీ విభాగం శుక్రవారంనాడు పంపించింది. 2017-2021 మధ్య కాలానికి ఐటీ విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తాజా నోటీసులను ఐటీ విభాగం పంపింది. దీనిపై రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదకగా స్పందించారు. ''ప్రభుత్వం మారినప్పుడు... ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై కచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరూ మళ్లీ ఇలాంటి పనులకు ఒడిగడ్డే సాహసం చేయని రీతిలోనే ఈ చర్యలు ఉంటాయి. ఇది నా హామీ'' అని రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.


కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆదాయం పన్ను అధికారులు రూ.200 కోట్ల పెనాల్టీ విధించడం, నిధులు స్తంభింప చేయడంతో ఇబ్బంది పడుతోంది. హైకోర్టు నుంచి కూడా ఎలాంటి ఉపశమనం దొరకలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. దీనిపై ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ తాజా సంకేతాలిచ్చారు. పన్ను చట్టాలను బీజేపీ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని, ఇందుకు ఆ కాషాయ పార్టీ నుంచి రూ,4,600 కోట్లు వసూలు చేయాలని అన్నారు. కాంగ్రెస్, విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకునేందుకు ఐటీ శాఖను బీజేపీ పావుగా వాడుకుంటోందని, దీనిపై సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ అశ్రయిస్తుందని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్‌ను ఉపయోగిచి బీజేపీ రూ.8,200 కోట్లు వసూలు చేసిందని, పన్ను ఉగ్రవాదంలో ఆ పార్టీ నిమగ్నమైందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 06:36 PM