Share News

White Paper: శ్వేతపత్రం అంటే ఏంటీ..? సభలో ప్రభుత్వాలు ఎందుకు ప్రవేశ పెడతాయి

ABN , Publish Date - Feb 07 , 2024 | 02:10 PM

లోక్ సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో శ్వేత పత్రం ప్రవేశ పెడతామని స్పష్టంచేసింది. యూపీఏ హయాంలో ఆర్థిక వనరుల దుర్వినియోగం జరిగిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు.

White Paper: శ్వేతపత్రం అంటే ఏంటీ..? సభలో ప్రభుత్వాలు ఎందుకు ప్రవేశ పెడతాయి

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో శ్వేత పత్రం ప్రవేశ పెడతామని స్పష్టంచేసింది. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిన ఫలాలను పార్లమెంట్‌ ముందు ఉంచనుంది. యూపీఏ హయాంలో ఆర్థిక వనరుల దుర్వినియోగం జరిగిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. దాంతోపాటు రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారు. పదవీ విరమణ చేసే 56 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందుకోసం బడ్జెట్ సమావేశాలను ఒక రోజు పొడిగించారు.

శ్వేతపత్రం అంటే ఏంటీ..?

గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పు ఒప్పులు, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి స్పష్టమైన విధానంతో నివేదించే అంశాన్ని శ్వేతపత్రం (white paper) అంటారు. దేశం/ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకాలు, క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం కలిగిందా..? ఆ పథకాలతో జనాలకు మేలు జరగపోయినా, దాంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందని పార్లమెంట్/ అసెంబ్లీకి శ్వేతపత్రాన్ని సమర్పిస్తాయి. కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సమయంలో శ్వేతపత్రం సమర్పిస్తామని మోదీ సర్కార్ చెబుతోంది. బడ్జెట్ సమావేశాల్లోనే శ్వేతపత్రం ప్రవేశపెడతామని స్పష్టంచేసింది. యూపీఏ హయాంలో జరిగిన అవినీతితో దేశం వెనకబాటుకు గురయ్యిందని విమర్శించే అవకాశం ఉంది.

యూపీఏ హయాంలో లూటీ..?

శ్వేతపత్రంలో యూపీఏ హయాంలో తప్పులను ప్రధానంగా ప్రస్తావిస్తారు. ‘యూపీఏ పాలనలో పదేళ్ల సమయాన్ని కోల్పోయాం. ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగం సమస్యను ఎదుర్కొంది. గనుల నుంచి బ్యాంక్‌ల వరకు ప్రతి రంగం సమస్యలు ఎదుర్కొన్నాయి. యూపీఏ ప్రభుత్వం శ్వేతపత్రం సమర్పించలేదు. ప్రజలు, సంస్థలపై విశ్వాసం కోల్పోకూడదని దూరంగా ఉంది. మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాం. ప్రధాని మోదీకి ట్విస్ట్స్ అంటే ఇష్టం ఉండదు. అందుకోసమే ఇప్పుడు శ్వేతపత్రంతో ముందుకు వస్తున్నాం. 2014లో దేశం పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని’ నిర్మలా సీతారామన్ మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 07 , 2024 | 02:10 PM