Share News

మాకు సంబంధం లేదు.. మేము పట్టించుకోం..: మోదీ వ్యాఖ్యలపై మాథ్యూ మిల్లర్

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:32 PM

భారత్, పాకిస్తాన్ గొడవతో తమకు సంబంధం లేదని.. తాము పట్టించుకోబోమని.. ఆ రెండు దేశాలే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు సైతం వెనుకాడబోమని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు.

మాకు సంబంధం లేదు.. మేము పట్టించుకోం..: మోదీ వ్యాఖ్యలపై మాథ్యూ మిల్లర్

భారత్, పాకిస్తాన్ గొడవతో తమకు సంబంధం లేదని.. తాము పట్టించుకోబోమని.. ఆ రెండు దేశాలే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు సైతం వెనుకాడబోమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవల ప్రకటించారు. దీనిపై స్పందించిన మాథ్యూ మిల్లర్.. భారత్, పాక్ మధ్యలోకి తాము రాబోమని.. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పామన్నారు. అయితే సమస్య మరింత జఠిలం కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

Lok Sabha election 2024: ఎల్లుండ తొలి దశ పోలింగ్: నేటితో ప్రచారానికి తెర


ఈ నెల 5వ తేదీన ది గార్డియన్ అనే బ్రిటీష్ వార్తా పత్రిక.. పాక్‌లో భారత్ అనేక మారణహోమాలు సృష్టించిందని ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ఇదొక తప్పుడు ప్రచారమని.. కావాలని భారతదేశంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కథనం వెలువడిన కొన్ని రోజుల తర్వాత, ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉందని.. ఉగ్రవాదులను అంతమొందిస్తుందని తెలిపారు. దేశ శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే ఉగ్రవాదులను ప్రభుత్వం విడిచిపెట్టదని హెచ్చరించారు. వారు పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లినా వేటాడి మట్టుబెడతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Ayodhya: అయోధ్య రాముడికి అపూర్వ ఘట్టం.. ఆ వేడుకనూ మీరూ చూసేయండి..

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 17 , 2024 | 01:34 PM