Share News

Ayodhya: అయోధ్య రాముడికి అపూర్వ ఘట్టం.. ఆ వేడుకనూ మీరూ చూసేయండి..

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:41 PM

శ్రీరామనవమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభతో అయోధ్య ( Ayodhya ) పరవశిస్తోంది. రామ్ లల్లా సూర్య తిలకం కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు బాల రాముడికి దివ్య అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Ayodhya: అయోధ్య రాముడికి అపూర్వ ఘట్టం..  ఆ వేడుకనూ మీరూ చూసేయండి..

శ్రీరామనవమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభతో అయోధ్య ( Ayodhya ) పరవశిస్తోంది. రామ్ లల్లా సూర్య తిలకం కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు బాల రాముడికి దివ్య అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. రామనవమి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయం తెలిచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. భక్తులు పోటెత్తడంతో అర్థరాత్రి వరకు ఆలయం తెరిచే ఉంటుందని, మొత్తం 19 గంటల పాటు దర్శన ఏర్పాట్లు కల్పిస్తామని ఆలయ పూజారులు తెలిపారు. ఈ క్రమంలో తెల్లవారు జామున నిర్వహించిన అభిషేకం కార్యక్రమం వేద మంత్రోఛ్చరణల నడుమ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆలయ అధికారులు ఎక్స్ లో పోస్ట్ చేశారు.


PM Modi: ఈ శుభ సందర్భంలో నా మనస్సు భావోద్వేగంతో నిండిపోయింది.. ప్రధాని మోదీ

మరోవైపు.. రామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు. ఈ శుభ సందర్భంలో నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయాయన్నారు. ఈ ఏడాది నేనూ, లక్షలాది మంది నా దేశ ప్రజలు అయోధ్యలో రామ్ మందిరాన్ని దర్శించుకున్నాం. ఈ జ్ఞాపకాలు ఇప్పటికీ నాలో శక్తిని నింపుతాయి అని ప్రధాని ట్వీట్ చేశారు.

Ayodhya: సూర్య తిలకానికి సిద్ధమైన సాకేతపురి.. జై శ్రీరామ్ నినాదంతో మారు మోగుతున్న అయోధ్య..

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 17 , 2024 | 12:41 PM