Share News

Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. తన్మయత్వంతో పులకించిన భక్త జనం

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:41 AM

అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీ రాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాలపై ఉంది.

Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. తన్మయత్వంతో పులకించిన భక్త జనం

అయోధ్య: అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీ రాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాలపై ఉంది.

శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించాయి. గుడి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.


ఈ ఏడాది జనవరి 22న ప్రధాని మోదీ(PM Modi) చేతులమీదుగా రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. మంగళవారమే సూర్య కిరణాల ప్రసరణ ప్రక్రియను శాస్త్రవేత్తలు పరిశీలించారు.

ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహం నుదుట కిరణాలతో తిలకం(Surya Tilak) ఏర్పాటు చేయడమే సూర్య తిలక్ ముఖ్య ఉద్దేశం. చైత్రమాసంలో సాక్షాత్కరించే ఈ అద్భుత దృశ్యం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ఆవిష్కృతమైంది. మూడున్నర నిమిషాలపాటు సూర్య తిలకం 58 మి.మీ.ల పరిమాణంలో కనిపించి భక్తులకు కనువిందు చేసింది.


రెండు నిమిషాలు పూర్తిస్థాయిలో తిలకంలా కనిపించింది. అంటే బాల రాముడి నుదుటిని సూర్యుడు ముద్దాడాడన్నమాట. సూర్య అభిషేకం, సూర్య తిలకంగా పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు అయోధ్య రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

Ram Navami 2024 Live: వైభవంగా శ్రీసీతారాముల కళ్యాణం.. భద్రాచలం నుంచి లైవ్ మీకోసం..

మందిర నిర్మాణం తరువాత తొలి శ్రీ రామ నవమి కావడంతో మందిర పరిసరాలను అందంగా అలంకరించారు. అశేషంగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా ఆలయంలో భక్తులకు చలువ పందిళ్లు చేశారు.

సూర్య కిరణాలు రాముడి నుదిటిపై ఎలా పడతాయంటే..

సూర్య తిలకం కోసం మూడో అంతస్తులో విదేశాల నుంచి తెప్పించిన అద్దాలను అమర్చారు. సూర్య కిరణాలు అందులో పడి రెండో అంతస్తులోకి, ఆపై గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గర్భగుడిలోని బాలక్ రామ్ విగ్రహం నుదుటిపై పడతాయి. సూర్యుడి డైరెక్షన్, కిరణాలు ప్రసరించే కోణాన్ని లెక్కగట్టి ఈ అద్దాలను అమర్చారు. ఏటా రామ నవమి రోజు మాత్రమే ఈ అద్భుతం సాక్షాత్కరించేలా డిజైన్ చేశారు. రాముడి నుదిటిపై సూర్యకిరణాలు పడిన మరుక్షణం భక్తులు తన్మయత్వం చెందనున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 17 , 2024 | 01:23 PM