Share News

Yogi Adityanath: షరియత్ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 24 , 2024 | 09:23 AM

రాజ్యాంగం(constitution) కంటే షరియత్(Shariat law) పెద్దది కాదని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(yogi adityanath) వ్యాఖ్యానించారు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని గుర్తు చేశారు. ముస్లింలు దేశంలో(india) ఇళ్లు సహా అనేక పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు.

Yogi Adityanath:  షరియత్ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

రాజ్యాంగం(constitution) కంటే షరియత్(Shariat law) పెద్దది కాదని ఉత్తర్‌ప్రదేశ్(uttar pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్(yogi adityanath) వ్యాఖ్యానించారు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని గుర్తు చేశారు. ముస్లింలు దేశంలో(india) ఇళ్లు సహా అనేక పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి క్రమంలో భారతదేశ చట్టాలను కూడా అనుసరించాలని స్పష్టం చేశారు.

ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. షరియత్ మీ వ్యక్తిగత అంశం కావచ్చు, కానీ అది రాజ్యాంగానికి అతీతమైనది కాదని అన్నారు. మరోవైపు మదర్సాలను(madarsa) కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. మనకు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే మన విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని అన్నారు.


హిందువు భారతదేశానికి(bharath) ప్రాథమిక ఆత్మ అని, వారిని అవమానించవద్దని సూచించారు. సెంటిమెంట్‌ను కించపరిచే రాజకీయాలు(politics) చేయోద్దని హితవు పలికారు. దేశ భద్రత, హిందూ విశ్వాసం పట్ల మనం రాజీ పడలేమన్నారు. మేము రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడం లేదని చెప్పారు. చట్టబద్ధతతో అల్లర్లు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. 2017కి ముందు అయోధ్య, ఇప్పుడు అయోధ్య మధ్య అవకాశాలు 100 రెట్లు పెరగాయని చెప్పారు. లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. భగవంతుని దయ అందరికీ అండాలని ఆకాంక్షించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) అరెస్టుపై యోగి ఆదిత్యనాథ్(yogi adityanath) మాట్లాడుతూ చట్టానికి ఎవరూ అతీతులు కారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ మళ్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ప్రజాస్వామ్యం ఏ వ్యక్తిని, పార్టీని లేదా సంస్థను దోపిడీ చేయడానికి అనుమతించదు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి యజమాని కాదు. మా పని పబ్లిక్ సర్వెంట్ మాత్రమే అని వ్యాఖ్యానించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ దావా

Updated Date - Mar 24 , 2024 | 10:11 AM