Share News

Uttar Pradesh: యూపీ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ పోటీ..

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:26 PM

ఆమె తెలంగాణలోని(Telangana) నల్గొండ(Nalgonda) ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ.. కానీ, ఇప్పుడామె యూపీ ఎన్నికల్లో(Uttar Pradesh Elections) తలపడుతున్నారు. యూపీలోని జౌన్‌పుర్‌(Jaunpur) లోక్‌సభ స్థానం నుంచి బిఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తెలంగాణ మహిళ ఏంటి..

Uttar Pradesh: యూపీ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ పోటీ..
Srikala Reddy

లక్నో, ఏప్రిల్ 18: ఆమె తెలంగాణలోని(Telangana) నల్గొండ(Nalgonda) ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ.. కానీ, ఇప్పుడామె యూపీ ఎన్నికల్లో(Uttar Pradesh Elections) తలపడుతున్నారు. యూపీలోని జౌన్‌పుర్‌(Jaunpur) లోక్‌సభ స్థానం నుంచి బిఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తెలంగాణ మహిళ ఏంటి.. యూపీలో పోటీ చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ చదవాల్సిందే.

తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు. స్థానిక నాయకుడు, మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య అయిన శ్రీకళారెడ్డి.. ఆయనకు బదులుగా ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు. వాస్తవానికి ధనుంజయ్ సింగ్‌పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీంతో ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తనకు బదులుగా తన భార్య శ్రీకళా రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిపారు ధనుంజయ్ సింగ్. బీఎస్పీ తరఫున జౌన్‌పుర్ ఎంపీగా శ్రీకళారెడ్డి పోటీలో నిలిచారు. ఇదే స్థానంలో బీజేపీ నుంచి కృపాశంకర్ సింగ్, ఎస్పీ నుంచి బాబూసింగ్ కుశ్వాహా పోటీ చేస్తున్నారు.


శ్రీకళారెడ్డి స్వస్థలం ఇదే..

కె. జితేందర్ రెడ్డి-లలితా రెడ్డి దంపతుల కుమార్తె శ్రీకళారెడ్డి. జితేందర్ రెడ్డి నల్గొండ జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా, హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. జితేందర్ రెడ్డి నిప్పో బ్యాటరీ గ్రూప్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఇది చెన్నై కేంద్రంగా పని చేయగా.. శ్రీకళారెడ్డి బాల్యం అంతా అక్కడే గడిచిపోయింది. ఇంటర్మీడియట్ వరకు చెన్నైలో చదివిన శ్రీకళారెడ్డి.. బీకామ్ మాత్రం హైదరాబాద్‌లో చదివింది. ఆ తరువాత అమెరికాకు వెళ్లి ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేసింది శ్రీకళారెడ్డి. అక్కడ స్టడీ కంప్లీట్ అయ్యాక ఇండియాకు వచ్చిన ఆమె.. కుటుంబ వ్యాపారాలు చూసుకుంది.


ధనుంజయ్‌ సింగ్‌తో వివాహం..

యూపీకి చెందిన చెందిన ధనుంజయ్ సింగ్‌ను శ్రీకళారెడ్డి వివాహం చేసుకుంది. గతంలో ఆమె బీజేపీలో కూడా చేరారు. ఆ తరువాత 2021లో యూపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన శ్రీకళారెడ్డి.. జెడ్పీ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు బీఎస్పీ ఆమెకు ఎంపీ టికెట్ కేటాయించడంతో.. ఎన్నికల బరిలో నిలిచారు. వాస్తవానికి జౌన్‌పుర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. ఒకసారి ధనుంజయ్ సింగ్, మరోసారి శ్యామ్ సింగ్ యాదవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే.. బీఎస్పీ అధినేత్రి ధనుంజయ్ సింగ్ భార్య అయిన శ్రీకళారెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించారు.


ఇవి కూడా చదవండి:

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు..

మాజీ ప్రధాని సంచలన కామెంట్స్..

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 12:26 PM